ఈ పేరు ఇంట్లోని ఏ అమ్మాయికి పెట్టకండి….పెడితే సర్వనాశనం, మ్యాటర్ కోసం ఇది చూడండి!

0
123
ఒకప్పుడు మన పెద్దలు చెప్పినట్లు ధనం మూలం ఇదం జగత్ అనే మాటని ప్రస్తుతం కాలంలో  పూర్తిగా నిజం చేస్తూ వస్తున్నాడు నేటి మానవుడు. మనిషి పుట్టిన దగ్గరినుండి చనిపోయేవరకు దాదాపుగా ప్రతి విషయం డబ్బుతోనే ముడిపడి ఉంటోంది అంటే డబ్బుకు ఎంతమేర విలువ పెరిగిందో అర్ధం చేసుకోవచ్చు. అలానే మనలో చాలామంది ధనానికి మూలమైన లక్ష్మి దేవికి నిత్యం పూజలు చేస్తూ ఆమె అనుగ్రహాన్ని పొందుతుంటారు. ఇక అంతేకాక ఆమె అనుగ్రహించాలని ఆమెను మరింత నిష్టగా పూజించేవారు కూడా వున్నారు. ఇకపోతే అందరికి సకల భోగభాగ్యాలు అనుగ్రహించే ఆ సిరుల తల్లి లక్ష్మీదేవి జీవితం గురించి తెలుసుకుంటే మనకు కొంత ఆశ్చర్యం వేస్తుంది. నిజానికి దేవతలు మరియు రాక్షసులు కలిసి పాలసముద్రాన్ని చిలకగా పుట్టుకువచ్చిన లక్ష్మీదేవిని తన జీవిత భాగస్వామిగా చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు శ్రీ మహావిష్ణువు. అయితే లక్ష్మీదేవికి అక్క అయిన అలక్ష్మికి పెళ్లి కాకుండా చిన్న అమ్మాయి లక్ష్మికి పెళ్లి చేయడం సబబు కాదని అనుకుంటారు ఆమె తల్లి తండ్రులు.
అయితే చూడడానికి అందవికారంగా కనపడే అలక్ష్మి, ఎక్కడ అడుగుపెడితే అక్కడ వున్నది తుడిచిపెట్టుకుపోవడం, అలానే ఆమె కాలుపెట్టిన చోటు అంతా పాడవడం జరుగుతుండడంతో ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రారు. ఇక చిరవరకు ఉద్దాలకుడు అనే మునీశ్వరుడు ఆమెను చేసుకోవడానికి ముందుకు వస్తాడు. అయితే అలక్ష్మికి ఎక్కువగా కారం మరియు పులుపు అంటే బాగా ఇష్టమని, ఎప్పుడు ఇంటిని అశుభ్రంగా ఉండడానికే అలక్ష్మి ఇష్టపడుతుందనీ పురాణాలూ చెపుతున్నాయి. ఇక ఆమె వివాహం తరువాత లక్ష్మి దేవిని శ్రీ మహా విష్ణువు వివాహం చేసుకున్నారు. అందుకే మన పూర్వీకులు మనం ఏదైనా శుభం తలపెట్టినప్పుడు పచ్చిమిర్చి, లేదా ఎండుమిరప మరియు నిమ్మకాలను ఆ కార్యాల సమయంలో కట్టిస్తుంటారు. ఆ విధంగా చేస్తే అలక్ష్మీ బయటకు వెళ్లి లక్ష్మి దేవి లోనికి వచ్చి మనకు సిరులు కురిపిస్తుందని నానుడి. సో చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇల్లు ఎప్పుడూ సకల సిరులతో విరసిల్లాలంటే ఇంటిని ఎప్పటికపుడు శుభ్రంగా ఉంచుకుని, నిష్ఠ మరియు శ్రద్ధతో లక్ష్మి దేవిని పూజించండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here