మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్

0
76

 

సూపర్ మహేష్ బాబు భరత్ అనే నేను సూపర్ హిట్ సినిమా తరువాత భారీ అంచనాలతో తెరకెక్కుతున్న చిత్రం `మహర్షి`. ఈ సినిమాకి వంశి పైడిపల్లి ధరకత్వం వహిస్తున్నారు. హీరోయిన్ గ పూజ హెగ్డే నటిస్తున్నది. అల్లరి నరేష్ ఈ సినిమాలో ఓ కీలక మైన పాత్రలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ఈ సినిమా ట్రైలర్ పాటలు రిలీజ్ అయ్యి యూట్యూబ్  సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి మహేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మహర్షి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మే 1 న హైదరాబాద్ నెక్లెస్ రోడ్  పీపుల్స్ ప్లాజా లో జరుగు తుందని చెప్పారు. ఈ ఈవెంట్ టికెట్ కోసం అభిమానులు ఎగబడుతున్నారు. ఈ సినిమా మే 9 న  ప్రేక్షకుల ముందుకు రానున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here