వైరల్ అవుతున్న మహేష్ బాబు మరియు సితారల వీడియో!

0
84
మహేష్ బాబు  ఫ్యాన్స్ ప్రస్తుతం మంచి పండుగ సంబరాల్లో వున్నారు. దీనికి రెండు కారణాలున్నాయి. అందులో ఒకటి మహర్షి సెకండ్ లుక్, అలానే మరొకటి మహేష్ బాబు తన కూతురుతో కలిసి చేసిన డ్యాన్సింగ్ వీడియో. ఇక వివరాల్లోకి వెళితే, సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్ లో ప్రతిష్టాత్మకమైన 25వ సినిమా మహర్షి లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మహర్షి సెకండ్ లుక్ ని విడుదల చేసింది సినిమా యూనిట్. అయితే రిలీజ్ అయిన వెంటనే ఆ సెకండ్ లుక్ పోస్టర్ సోషల్ మీడియా వేదికల్లో విపరీతంగా వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఇక ఈ నూతన సంవత్సరాన్ని మహేష్ బాబు తన ఫ్యామిలితో కలిసి దుబాయి లో సెలెబ్రేట్ చేసుకుంటున్నట్లు ఇప్పటికే తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తెలిపారు. ఇక నిన్న రాత్రి న్యూ ఇయర్ సందర్భంగా తన కూతురు సితార తో కలిసి మహేష్ బాబు చేసిన ఒక డ్యాన్సింగ్ వీడియో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది.
Image result for mahesh babu sithara dancing video
మహేష్ బాబు మరియు సితార, న్యూ ఇయర్ పార్టీ సందర్భంగా ప్లే అవుతున్న ఒక సాంగ్ కి వేసిన డాన్స్ చూసిన వారందరు వావ్ అంటూ ఆ వీడియోపై పొగడ్తలు కురిపిస్తున్నారు. నిజానికి ఒకప్పుడు చాలావరకు రిజర్వుడు గా వుండే మహేష్ బాబు, కొన్నేళ్ల క్రితం నమ్రతను వివాహం చేసుకున్న తరువాత అలానే పిల్లలు పుట్టాక ఇటీవల తన పద్దతిని మార్చుకుని పూర్తిగా ఫ్రీగా వుంటున్నారు. అంతేకాక కొన్నేళ్లుగా మహేష్ బాబు తన వ్యక్తిగత జీవితాన్ని గురించిన దాదాపుగా ప్రతి విషయాన్నీ తన సోషల్ మీడియా వేదికల ద్వారా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటున్నారు. ఇక కూతురుతో కలిసి మహేష్ చేస్తున్న ఈ డ్యాన్సింగ్ వీడియోపై అయన ఫ్యాన్స్ విపరీతంగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here