మహేష్ బాబు బ్యాంకు ఖాతాలు జప్తు……….మ్యాటర్ కోసం ఇది చూడండి!

0
91
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్ లో ప్రతిష్టాత్మకమైన 25వ సినిమా మహర్షిలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల  భరత్ అనే నేను మూవీ తో మంచి  హిట్ కొట్టి తన ఫ్యాన్స్ కి ఊపునిచ్చిన సూపర్ స్టార్, ఈసారి మహర్షి తో కూడా ఫ్యాన్స్ కి మరొక హిట్ ఇవ్వాలని కష్టించి పని చేస్తున్నారు. ఇక ఎప్పుడు వివాదాలకు మరియు వ్యక్తిగత వాదనలకు దూరంగా వుండే సూపర్ స్టార్ కు సంబంధించి ప్రస్తుతం ఒక వార్త టాలీవుడ్ వర్గాల్లో వైరల్ గా మరి సంచలనం సృష్టిస్తోంది. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, మహేష్ బాబుకు సంబందించిన కొన్ని బ్యాంకు ఖాతాలను జప్తు చేసారు వస్తు మరియు సేవ పన్నుల (జీఎస్టీ) అధికారులు. ఇటీవల కొన్ని వాణిజ్య ఉత్పత్తుల ప్రచారానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించి సంపాదించిన సొమ్ముపై  2007-08 సంవత్సరానికి సంబంధించి ఆయన రూ.18.5 లక్షల సేవా పన్ను చెల్లించాల్సి ఉందని హైదరాబాద్‌ జీఎస్టీ కమిషనర్‌ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు.
Image result for mahesh babu
అప్పటినుంచి పన్ను కట్టకపోవడంతో అసలు, వడ్డీ మరియు అపరాధ రుసుము కలిపి ఆ మొత్తం రూ.73.5 లక్షలకు చేరిందన్నారు. అయితే ఆ సొమ్మును రాబట్టుకునేందుకు వీలుగా మహేష్‌బాబుకు సంబంధించి అయన రెండు ప్రముఖ బ్యాంకుల ఖాతాలను జప్తు చేశామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఈ విషయమై మహేష్ బాబు మరియు నమ్రత గారికి సమాచారం ఇవ్వడం జరిగిందని అయన చెప్పారు. కాగా ప్రస్తుతం విదేశాల్లో తన ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో వున్న మహేష్ బాబు ఈ ఘటనపై ఎలా స్పందిస్తారో చూడాలి మరి. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ వర్గాల్లో వైరల్ గా మారింది…….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here