2.0 పై మహేష్ బాబు చేసిన కామెంట్స్ చేస్తే ఆశ్చర్యపోతారు!

0
128
సూపర్ స్టార్ రజినీకాంత్, శంకర్ ల కాంబినేషన్ లో వచ్చిన 2.0 సినిమా నిన్న విడుదలైన సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక మొదటి షో నుండి ఈ సినిమాకు దాదాపుగా అన్ని చోట్ల నుండి మంచి టాక్ రావడంతో సినిమా యూనిట్ సంబరాలు చేసుకుంటోంది. ఇకపోతే ఈ సినిమా చూసిన పలువురు సినీ ప్రముఖులు సైతం శంకర్, రజిని, అక్షయ్ కుమార్ లను విపరీతంగా పొగడ్తలతో ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. ఇక నేడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా తెలిపారు. నిజానికి ఏ భాషలో అయినా సరే ఒక మంచి సినిమా వస్తే దానిని చూసే మహేష్ బాబు, దానికి తనవంతుగా ట్వీట్ చేయడం, లేదా ఏదైనా పోస్ట్ వంటివి పెట్టడం ద్వారా తన మద్దతు తెలుపుతుంటారు.
ఇక ఈ విజువల్ వండర్ చూసిన మహేష్ బాబు కాసేపటి క్రితం ఈ విధంగా ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ఇందాకే సినిమా చూసాను, నిజంగా ఇది ఒక అద్భుతం అనే చెప్పాలి. శంకర్ గారు తన అద్భుతమైన టాలెంట్ తో సినిమాని మరొక స్థాయికి తీసుకెళ్లారని అన్నారు. ఇక రజిని సర్, అక్షయ్ కుమార్ ల నటన చాలా బాగుందని, మంచి హిట్ టాక్ సంపాదించిన ఈ సినిమా రాబోయే రోజుల్లో మరింత పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్లు మహేష్ బాబు 2.0 యూనిట్ కు ధనువాదాలు తెలిపి మరొక్కసారి తన గొప్ప మనసుని చాటుకున్నారు. ఇక ఇలా టాలీవడ్ సూపర్ స్టార్, కోలీవుడ్ సూపర్ స్టార్ ని పొగడడం సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here