మహేష్ బాబు అద్భుతమైన రికార్డు… ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖయాం!

0
32
చిన్నప్పుడే తండ్రి కృష్ణ గారి నటవారసత్వంతో సినిమాల్లోకి బాలనటుడిగా ప్రవేశం చేసిన మహేష్ బాబు, ఆ తరువాత రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆ సినిమాతో అద్భుత విజయాన్ని అందుకున్నారు. ఇక అప్పటినుండి తన కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కున్న మహేష్ బాబు, ఆ తరువాత మెల్లగా వరుస విజయాలతో ప్రస్తుతం సూపర్ స్టార్ స్టేటస్ ని సాధించి అగ్రహీరోగా దూసుకెళ్తున్నారు. ఇక మహేష్ అనేక దేశీయ బ్రాండ్లకు అంబాసడర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఆ విధంగా అయన ఏ హీరోకి లేని ఒక అద్భుతమైన రికార్డుని తన సొతం చేసుకున్నారు.
Image result for super star mahesh babu
ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, మహేష్ ప్రస్తుతం అభిబస్, గోల్డ్ విన్నర్, థమ్స్ అప్, చెన్నై సిల్క్స్, క్లోజ్ అప్‌, లాయిడ్, లతో కూడిన 15 బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. దీంతో సౌత్ ఇండియాలోనే అత్యధిక బ్రాండ్స్‌కు ఎండార్స్ చేస్తున్న ఏకైక హీరోగా మహేష్ తిరుగులేని రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇక రాబోయే రోజుల్లో మరికొన్ని పెద్ద సంస్థలు కూడా ఆయనను ప్రచారకర్తగా తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం మహేష్ బాబు తన కెరీర్ లో ప్రతిష్టాత్మక 25వ సినిమాగా రానున్న ‘మహర్షి’ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 5 న విడుదల కానుంది…