మరొక చిన్న దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన మహేష్ బాబు?

0
28
సూపర్ స్టార్ మహేష్ బాబు కేవలం పెద్ద డైరెక్టర్లకు మాత్రమే కాక, మంచి టాలెంట్ ఉంటే, కొత్తవారికి కూడా అవకాశం ఇవ్వడంలో ఎప్పుడూ ముందుంటారు. అయితే అయన ప్రస్తుతం పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ కు అవకాశం ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. నిజనైకి పెళ్లి చూపులు, విజయ్ దేవరకొండకు మాత్రమే కాదు, తరుణ్ కు కూడా తొలి చిత్రం కావడం విశేషం. ఇక ఆ సినిమా విజయంతో తరుణ్ కు కూడా మంచి అవకాశాలు వచ్చాయి. అయితే అయన ఇటీవల సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తీసిన ఈ నగరానికి ఏమైంది అనే సినిమా, విమర్శకుల ప్రశంశలు అందుకున్న విషయం తెలిసిందే.
Image result for mahesh babu tarun bhaskar
ఒక గమ్మత్తైన విషయం ఏమిటంటే, ప్రస్తుతం విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్ ని హీరోగా పెట్టి ఒక సినిమా నిర్మిస్తుండడం విశేషం. ఆ విషయం అటుంచితే, ఇక రెండు రోజుల క్రితం తరుణ్, సూపర్ స్టార్ మహేష్ గారిని కలిసి ఆయనకు ఒక మంచి స్టోరీ లైన్ వినిపించడం జరిగిందని అంటున్నారు. అయితే ఆ లైన్ మహేష్ కు సూపర్బ్ గా నచ్చడంతో, పూర్తి స్క్రిప్ట్ డెవలప్ చేసుకురమ్మని చెప్పారట మహేష్. అతిత్వరలో పూర్తి చేసి మిమ్మల్ని వచ్చి కలుస్తానని చెప్పాడట తరుణ్. ఇక దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో మహేష్ బాబు అనిల్ రావిపూడి, సందీప్ రెడ్డి వంగ, తరుణ్ భాస్కర్ వంటి యువ దర్శకులతో మహేష్ బాబు పనిచేయడం ఖాయంగా కనిపిస్తోంది…..