మహేష్ బాబు మహర్షి షూటింగ్ పిక్స్ లీక్…..ఇంటర్నెట్ లో వైరల్!

0
65
సూపర్ స్టార్ మహేశ్‌ బాబు భరత్ అనే నేను సినిమా ఇచ్చిన అద్భుత విజయంతో ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహర్షి సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. అయితే ఆ షూటింగ్ కి సంబంధించి కొద్దిరోజులుగా ఫోటోలు, లొకేషన్ వీడియో లీక్ అయి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ ను నిన్నటివరకు పొల్లాచ్చిలోని ఒక పల్లెటూరిలో తీస్తుండటంతో, విషయం తెలుసుకున్న అక్కడి ప్రజలు, మహేశ్ ను చూసేందుకు ఎగబడ్డారు. వారిని అపదుపు చేయలేని పరిస్థితిలోనే చిత్ర బృందం, ఆ విధంగానే షూటింగ్ ను కొనసాగించగా, గుంపులో నుంచి ఓ వ్యక్తి షూటింగ్ ను వీడియో తీశాడు. ఆపై దానిని సోషల్ మీడియాలో పెట్టడంతో, కొందరు దానిని షేర్ మీద షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.
ఇదే సమయంలో పొలాల మధ్య మహేశ్‌ నడుచుకుంటూ వస్తున్నట్టు ఉన్న చిత్రాలు, అలానే ఒక మీటింగ్ లో మాట్లాడుతున్న చిత్రాలు కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మహేశ్ తో సెల్ఫీలు దిగిన వారు కూడా తమ ఫోటోలను పోస్ట్ చేసి ఆనందిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం ప్రస్తుత షెడ్యూల్ ఇప్పటికే పూర్తి కాగా, తదుపరి షెడ్యూల్ ఫిబ్రవరిలో మొదలు కానుంది. ఏప్రిల్ లో ఉగాది కానుకగా సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. కాగా ఈ సినిమాలో మహేష్ సరసన ముకుంద భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here