మరొక రెండు వారాల్లో మహేష్ బాబు కీలక నిర్ణయాలు?

0
75
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్ లో ప్రతిష్టాత్మకమైన 25వ సినిమా మహర్షిలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా, ఏప్రిల్ 25న ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇటీవల పొల్లాచ్చి లో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, మరొక పది రోజుల్లో హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకోనుంది. ఇకపోతే షూటింగ్ వల్ల మహేష్ కు ఒక వారానికి పైగా విరామం రావడంతో ఈ వారం రోజుల్లో అయన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నారట. ఇక ముఖ్యంగా ఆయన సందీప్ రెడ్డి, అనిల్ రావిపూడి తదితర యువ దర్శకుల నుండి కథలు విననున్నారని, అంతేకాక సుకుమార్ తో చేయబోయే తన సినిమా కథ కూడా విననున్నారట.
Image result for mahesh babu
అంతేకాక మరికొందరు కొత్త దర్శకులు కూడా ఈ సమయంలో మహేష్ ను కలవనున్నారని అంటున్నారు. అయితే ఈ వారం తరువాత మహేష్ చేసే తదుపరి ప్రాజెక్ట్స్ పై కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని, అంతేకాక మరొక పదిహేను రోజుల తరువాత ఆయన తదుపరి సినిమాల అనౌన్సమెంట్స్ కూడా ఫ్యాన్స్ కు కిక్ ను ఇవ్వనున్నాయి అనేది టాలీవుడ్ వర్గ్లాల నుండి వినిపిస్తున్న కీలక వార్త. అయితే రాబోయే రెండు వారాల తరువాత మహేష్ ఫ్యాన్స్ కు పండుగే అన్నమాట…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here