మరోసారి పోలీస్ ఆఫీసర్ గా మహేష్ బాబు…..మ్యాటర్ ఏంటంటే!

0
75
మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక దాని తరువాత అయన తన 26వ సినిమాని సుకుమార్ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. ఇకపోతే అతి త్వరలో ఆ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఆ విషయం అటుంచితే, ప్రస్తుతం అయన మరొక సినిమా కూడా ఒప్పుకున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.
Image result for mahesh babu anil ravipudi
ఇటీవల ఎఫ్2 సినిమాతో బంపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ సినిమా చేయడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, అంతేకాక ఆ సినిమాలో మహేష్ మరొక్కసారి పోలీస్ ఆఫిసర్ గా నటించనున్నారని, అయన ఇదివరకు చేసిన ఆగడు మూవీలోని పోలీస్ పాత్ర తరహాలో దానిని అనిల్ మలచనున్నారని అంటున్నారు. ఇక ఈ సినిమాను అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మించనున్నారని సమాచారం. అయితే ఈ విషయమై అతి త్వరలో అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం….