క్రికెట్ ఆడుతున్న మహేష్ బాబు….మ్యాటర్ ఏంటంటే?

0
53
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్ లో ప్రతిష్టాత్మకమైన 25వ సినిమా మహర్షితో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు, ఒక కాలేజ్ యువకుడిగా, ఒక బిజినెస్ మ్యాన్ గా, ఆ తరువాత ఇండియాలో ఒక రైతుగా కూడా కనపడనున్నారని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక మొన్న ఈ సినిమా షూటింగ్ పొల్లాచ్చిలో జరిగిన సమయంలో, మహేష్ బాబు కొందరు మీడియావారితో మాట్లాడుతున్న సీన్స్ లీక్ అయి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
Related image
ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి మరొక వార్త వైరల్ అవుతోంది. అదేమిటంటే, ఈ సినిమాలో మహేష్ బాబు ఒక క్రికెటర్ అవతారంలో కూడా కనపడనున్నారట. అయితే సినిమాలో వచ్చే కొన్ని కీలక ఘట్టాల్లో మహేష్ బాబు క్రికెటర్ గా ఇండియన్ జెర్సీ వేసుకుని బ్యాట్ పట్టుకుని క్రికెట్ ఆడే సీన్స్ ఇటీవల తీసారట యూనిట్ సభ్యులు. ఇక దీన్ని బట్టి చూస్తే మహేష్ ఈ సినిమాలో ఎన్ని గెటప్పుల్లో కనపడతారో అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here