ఎఫ్2 మూవీ పై మహేష్ బాబు ఏమన్నారంటే?

0
23
విక్టరీ వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ హీరోలుగా దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఎఫ్2… ఈ సినిమా నిన్న విడుదలై సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇక సినిమాలో వెంకీ మరియు వరుణ్ ల నటన అద్భుతంగా ఉండడం, ఇక సినిమా మొత్తం మంచి వినోదాత్మకంగా సాగడంతో ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరధం పడుతున్నారు. ఇక మరోవైపు ఇటీవల విడుదలైన ఎన్టీఆర్, వినయ విధేయ రామ సినిమాలు పెద్దగా టాక్ ని సంపాదించకపోవడంతో అందరూ ఈ సినిమాకే మొగ్గుచూపుతున్నారు.
Image result for f2 movie
ఇక ఈ సినిమాపై నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు తన స్పందనను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ, సినిమా ఆద్యంతం సూపర్ గా ఉందని, ఇక సినిమాలో వెంకీ సర్ అద్భుతంగా చేసారని, వరుణ్, తమన్నా, మెహ్రీన్ కూడా బాగా నటించారని అన్నారు. ఇక దర్శకుడు అనిల్ సినిమాని తెరెకెక్కించిన తీరుకు హ్యాట్సాఫ్ అని, సంక్రాంతికి మాకు మంచి గిఫ్ట్ ఇచ్చిన దిల్ రాజు గారికి కృతజ్ఞతలు అని ట్వీట్ చేసారు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు చేసిన ట్వీట్ టాలీవుడ్ వర్గాల్లో వైరల్ గా మారింది…