ఎన్టీఆర్ మూవీ పై మహేష్ బాబు సంచలన కామెంట్స్ … ఏమన్నారంటే?

0
91
దివంగత ఏపీ ముఖ్యమంత్రి మరియు విశ్వ విఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర  ఆధారంగా రూపొందిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా దాదాగాపుగా అన్నిచోట్ల నుండి మంచి పాజిటివ్ సంపాదించింది. ఇక ఈ సినిమా అద్భుతంగా ఉందని ప్రేక్షకులతో పటు కొందరు సినిమా నటులు కూడా కితాబిస్తున్నారు. ఇక నేడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాపై తన స్పందనను ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
Image result for mahesh babu in ntr biopic
కాసేపటిక్రితం ఎన్టీఆర్ గారి బయోపిక్ కథానాయకుడు చూసాను, నిజంగా ఎంతో వండర్ ఫుల్ గా వుంది, ఇక బాలకృష్ణ గారు తండ్రి ఎన్టీఆర్ గారి పాత్రలో జీవించారని, మిగతా నటీనటులు కూడా తమ పాత్రల్లో నటనతో అందరిని ఆకట్టుకున్నారని అన్నారు. ఇక దర్శకుడు క్రిష్ సినిమాను తెరకెక్కించిన తీరుకి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అని అయన తన ట్విట్టర్ లో తెలిపారు. నిజానికి ఏదైనా మంచి సినిమా వస్తే, దానిని తనవంతుగా ముందుండి ప్రోత్సహించే మహేష్ బాబు, ఈ సినిమాపై కూడా తన స్పందనను తెలియచేయడంతో ఆయనపై అందరూ సోషల్ మీడియా వేదికల్లో ప్రశంశల జల్లు కురిపిస్తున్నారు…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here