వైసిపి నుండి బయటికొచ్చిన మహేష్ బాబు బాబాయి…. మ్యాటర్ ఏంటంటే?

0
65
సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటినుండి తాను రాజకీయాలకు పూర్తి దూరం అని, నిజానికి తనకు ఎమ్యెల్యే మరియు ఎంపీ అనే పదాలకు అర్ధం కూడా తేలియాదని చెపుతుంటారు. ఇకపోతే గతంలో అయన తండ్రి కృష్ణ గారు ఏలూరు ఎంపీగా పనిచేసిన విషయం తెలిసిందే. ఇక అయన బాబాయి ఆదిశేషగిరి రావు ఎప్పటినుండో రాజకీయాల్లో వున్నారు, ఇక కొద్దిరోజుల క్రితం వైసిపి పార్టీలో చేరిన అయన నేడు ఆ పార్టీకి రాజీనామా చేసారు. వైసీపీ అధినేత జగన్‌ నుంచి టికెట్‌పై స్పష్టమైన హామీ రాకపోవడంతోనే ఆదిశేషగిరిరావు రాజీనామా చేశారనే ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన గుంటూరు లోకసభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని భావించారట.
Image result for adhi seshagiri rao
కానీ విజయవాడ ఎంపీగా పోటీ చేయాలని పార్టీ చెప్పడంతో ఆయన పార్టీ నుండి బయటకు వచ్చారని టాక్. మరి ప్రస్తుతం వైసీపీకి రాజీనామా చేసిన ఆదిశేషగిరిరావు అడుగులు ఎటువైపు పడతాయన్న చర్చ అప్పుడే మొదలయ్యింది. ఆయన టీడీపీవైపు మొగ్గు చూపుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. త్వరలోనే చంద్రబాబును కలిసి పసుపు కండువా కప్పుకుంటున్నారని పొలిటికల్ సర్కిల్‌లో టాక్ వినిపిస్తోంది. ఆయనకు బంధువులైన గల్లా జయదేవ్, గల్లా అరుణ కుమారిలు టీడీపీలో ఉన్నారు కాబట్టి  అటువైపు అడుగులు వేస్తారని గుసగుసలు. ఇక మరోవైపు కొందరు మహేష్ బాబు కు పవన్ కళ్యాణ్ మంచి సన్నిహితుడు కాబట్టి అయన సలహాతో ఆదిశేషగిరి రావు జనసేన పార్టీ తీర్ధం పుచ్చుకుంటారని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మరి అయన దారెటు అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here