గూఢచారితో మహేష్ బాబు సినిమా…… మ్యాటర్ తెలిస్తే షాక్ అవడం ఖాయం!

0
76
టాలీవుడ్ లో క్షణం సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు అడివి శేష్. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకోవడం, అనంతరం అయన నటించిన గూఢచారి సినిమా కూడా సూపర్ హిట్ కొట్టడంతో శేష్ కు విపరీతమైన క్రేజ్ మరియు ఫాలోయింగ్ సంపాదించాడు. ఇక ఆ సినిమా తరువాత శేష్, గూఢచారి సినిమాకు సీక్వెల్ గా గూఢచారి2 ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది.
Image result for mahesh babu adivi sesh
ఇక అడివి శేష్ ను ఊహించని ఒక అదృష్టం వరించినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. సూపర్ స్టార్ మహేష్ బాబు అయన తో సినిమా తీయాలని సిద్ధమయ్యారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం, గూఢచారి2 తరువాత శేష్ హీరోగా మహేష్ తన ఎంబి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఒక సినిమా నిర్మించనున్నారట. ఇక దీనిపై మరికొద్దిరోజుల్లో అధికారిక ప్రకటన కూడా వెలువడనుందట. కాగా ఈ వార్త ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here