అదరగొడుతున్న మజిలీ : మజిలీ రివ్యూ

0
101

2010 లో ఏమాయ చేసావే అంటూ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో  నాగచైతన్య , సమంత ల జోడి తో తెరకెక్కిన చిత్రం ఏ మాయ చేసావే . ఈ చిత్రం విడుదలై పెను సంచలనాన్ని సాధించిందంటే అతిశయోక్తి కాదు . నాగచైతన్య సమంత వెనకాల జెస్సి జెస్సి అంటూవెనుక తిరిగే సన్ని వేషాలు ఎవరైనా మర్చిపోగలరా చెప్పండి. మళ్ళి  అదే జోడి ఈ రోజు థియేటర్ లో కన్నుల సందడి చేస్తుంది .

దాదాపు తొమ్మిది సంత్సరాల తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య ,సమంత ల జోడి తో తెరకెక్కిన చిత్రం మజిలీ . అంతే కాకుండా పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలే ఉన్నాయ్ . అయితే ఆ అంచనాలకు తగ్గట్టు గానే ఈ సినిమా టాక్ కనిపిస్తుంది . ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది .
ఇందులో మరో కీలక పాత్ర పోషిస్తున్న దివ్యంశ కౌశిక్ నటన బాగుందంటూ చెప్పుకొస్తున్నారు . ఇక కథ విషయానికొస్తే ఇద్దరు భార్య ,భర్తలుగా  నాగచైతన్య సమంత ల జోడి నటన బాగుంది. నాగచైతన్య పెళ్లి కాక ముందు దివ్యంషతో జరిగిన ప్రేమాయణం తో అసహనానికి , ముందుకి బానిసైన నాగచైతన్య పెళ్లి చేసుకున్న తర్వాత చేసే పనులు , తన కెరీర్ మీద చూపే అశ్రద్దను , ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లో జరిగే విషయాలను శివ నిర్వాణ కళ్ళకు కట్టినట్టుల చూపించాడు.
సమంత , నాగచైతన్య ల నటన, పాటలు  ఈ మూవీ కి ప్లస్ కాగా కొన్ని చోట్ల ముందే చెప్పేయగల స్టోరీ ఈ మూవీ కి మైనస్ అని చెప్పుకోవచ్చు . ఏది ఏమైనా మంచి టాక్ తో ఈ మూవీ దూసుకుపోతుంది .

ఈ మూవీ కి తెలుగుగరంచాయి ఇస్తున్న రేటింగ్ : 3.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here