జనసేన పార్టీపై మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు!

0
74
ప్రస్తుతం ఆంధ్రాలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ప్రధాన పార్టీలు అన్ని ప్రజల్లోకి వెళ్లి తమ విధివిధానాలు వారి ముందు ఉంచుతూ, అధికారంలోకి వస్తే ఎటువంటి కార్యక్రమాలు చేపడతాం అనే విషయమై వారిని మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. ఇకపోతే మరోవైపు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కూడా ప్రచార కార్యక్రమాల్లో దూసుకుపోతోంది. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన కొందరు ప్రముఖులు కూడా పవన్ పార్టీపై తమ వంతుగా పాజిటివ్ గా స్పందిస్తున్న విషయం తెలిసిందే. ఇక నేడు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్, ట్విట్టర్ వేదికగా పవన్ పార్టీ పై ప్రశంశల జల్లు కురిపించాడు.
Related image
ఇటీవల కొద్దిరోజులుగా జనసేన పార్టీలో పలువురు విద్యావేత్తలు మరియు పాలిటిక్స్ విభాగం పై మంచి పట్టున్నవారు చేరుతున్న విషయం తెలిసిందే. అయితే అది నిజంగా శుభపరిణామమని, ఆ విధంగా రాజకీయ పరంగా ప్రజలకు న్యాయమైన మరియు ధర్మబద్ధమైన పాలనా అందించేందుకు పవన్ కళ్యాణ్ గారి పార్టీలో చేరడం నిజంగా ఎంతో ఆహ్వానించదగ్గ విషయం అని మనోజ్ ట్విట్టర్ ద్వారా ఒక పోస్ట్ చేస్తూ తెలిపారు. ఇక మనోజ్ చేసిన ఈ పోస్ట్ పై పవన్ అభిమానూలు విపరీతంగా పొగడ్తల జల్లు కురిపిస్తున్నారు. కాగా ప్రస్తుతం అయన పోస్ట్ సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అవుతోంది….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here