యూట్యూబ్ ని షేక్ చేస్తున్న మణికర్ణిక తెలుగు ట్రైలర్!

0
73
కంగనా రనావత్ హీరోయిన్ గా ప్రధాన పాత్రలో నటించిన చారిత్రాత్మక సినిమా మణికర్ణిక. ఇక ఇటీవల విడుదలైన ఈ సినిమా హిందీ ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చిన విషయం తెలిసిందే. మన దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా తెలుగు ట్రైలర్ ని కాసేపటి క్రితం యూట్యూబ్ లో విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా కార్యక్రమంలో కంగనా, క్రిష్ మరియు చిత్ర నిర్మాతలు అయిన జీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. నిజానికి ఈ సినిమాకు దర్శకుడు క్రిష్ అని, అయితే అయన ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కించడం వలన, సినిమాలో కొంత భాగాన్ని తాను తీయవలసి వంచిందని అన్నారు కంగనా.
Image result for manikarnika telugu trailer
ఇక బ్రిటీషర్లను గడగడలాడించిన అలనాటి ఆ వీరనారి పాత్రలో నేడు నేను నటించడం నిజంగా తన పూర్వజన్మ సుకృతమని, ఈ పాత్రకు తనను ఎంచుకున్నందుకు క్రిష్ కు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కంగనా చెప్పారు. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునే సన్నివేశాలు, అద్భుతమైన సెట్టింగులు, కంగనా మరియు ఇతర నటుల సన్నివేశాలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతమని చెప్పాలి. ఇక ప్రస్తుతం ఈ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ లో  లక్షల వ్యూస్ తో దూసుకెళుతోంది. కాగా సినిమా గణతంత్ర దినోత్సవ కానుకగా జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here