మస్తానమ్మ చనిపోయాక ఆమె మనుమడు చెప్పిన షాకింగ్ నిజాలు

0
129
నిజానికి ప్రస్తుతం ఇంటర్నెట్ వినియోగం ఏక్కువ అవడం, అంతేకాక మొబైల్ ఫోన్ మరియు ఇంటర్నెట్ డేటా అతి తక్కువ ధరలకే అందరికి అందుబాటులోకి రావడంతో ప్రతిఒక్కరు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా తమ సమయాన్ని గడుపుతున్నారు అనే చెప్పాలి. ఇక మరికొందరైతే యూట్యూబ్ లోనే వీడియోలు చూస్తూ చాలా వరకు తమ జీవితాన్ని గడుపుతున్నారు. అంతలా ఇవి ప్రస్తుత మనిషి జీవితంలో భాగమయ్యాయి. ఇక ఈ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఏదైనా కొంత కొత్తగా అనిపించిందంటే దానికి ప్రజలు విపరీతంగా అట్రాక్ట్ అవుతున్నారు. ఇక ఇటీవల కాలంలో ఏక్కువమంది తమకు తెలిసిన నైపుణ్యాలతో యూట్యూబ్ మాధ్యమంలో వీడియోలు పెట్టి వీక్షకులను ఆకర్షిస్తూ ఆపై డబ్బులు కూడా గడిస్తున్నారు. ఇక ఈ విధంగా యూట్యూబ్ ఛానల్ లో కంట్రీ ఫుడ్స్ పేరిట లక్ష్మణ్ అనే వ్యక్తి తన బామ్మ మస్తానమ్మతో కలిసి కొన్నాళ్ల క్రితం చేసిన వంటల వీడియోలు విపరీతంగా పాపులర్ అయ్యాయి. 106ఏళ్ళ వయసు గల ఈ బామ్మ మొదట్లో  బెండకాయ కూరను కట్టెల పొయ్యిపై వండి మెల్లగా తన రకరకాల వంటలతో వీక్షకులను విపరీతంగా ఆకర్షించింది.
ఇక ప్రస్తుతం ఆమె వంటలు ఎంతలా పాపులరయ్యాయంటే, ఇటీవల ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బిబిసి నెట్వర్క్ వారు సైతం మస్తానమ్మ దగ్గరకు వచ్చి, ఆమె వంటలపై ఒక డాక్యుమెంటరీ తీసేంతలా. కేవలం కట్టెలపొయ్యి మీదనే వంట చేసే మస్తానమ్మా, ఆలా చేస్తేనే వంటలకు రుచి వస్తుందని చెపుతుంటారు. ఇక నిన్న మస్తానమ్మ హఠాత్తుగా తన ఇంట్లో మరణించడం అందరిని కలిచివేసింది. ఇటీవల ఒక మీడియా ఛానల్ తో మాట్లాడిన మస్తానమ్మ, తనకు చూపు బాగా మందగించిందని చెప్పడం విన్న కొందరు వీక్షకులు, ఆమెకు మేము ఫ్రీ గా కంటి వైద్యం చేయిస్తాం అని కూడా కామెంట్స్ చేసారు. అయితే ఇలా అర్ధాంతరంగా మన అందరికి దూరంగా వెళ్ళిపోయిన మస్తానమ్మకు వారు తమ నివాళులు తెలుపుతున్నారు. ఇక తన బామ్మ చిన్నప్పటినుండి తమ కుటుంబానికి ఎంతో చేదుడువాదోడుగా ఉండేదని చెప్తున్నాడు ఆమె మనుమడు లక్ష్మణ్. నిజానికి ఆమెకు ఐదుగురు బిడ్డలని, అయితే కొన్నేళ్ళక్రితం అందులో నలుగురు మరణించగా తన తండ్రి ఒక్కరే మిగిలారని అన్నాడు.
అయితే మొదటినుండి పొలంలో కష్టించి పని చేసి కుటుంబాన్ని పోషించుకువచ్చిన మస్తానమ్మకు, వంటలు చేయడం కూడా బాగా రావడంతో, ఒకరోజు తాను ఇలా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాలని తలచి కంట్రీ ఫుడ్స్ ఛానల్ ని మొదలెట్టానని చెప్పాడు. అయితే మెల్లగా బామ్మ వంటలకు పేరు రావడం, వీక్షకులను ఆ వంటలు విపరీతంగా ఆకట్టుకుని లక్షల వ్యూస్ సాధించాయంటే అది కేవలం మా బామ్మ గొప్పతనమని ఆవేదనతో చెప్తున్నాడు లక్ష్మణ్. అంతేకాక తన 106 ఏళ్ళ వయసులో కూడా ఎంతో శ్రమటోడ్చి చేసిన వంటలతో యూట్యూబ్ ద్వారా మా కుటుంబానికి డబ్బు రూపేణా కూడా ఎంతో సాయం అందించిన తన బామ్మ ఇలా ఒక్కసారిగా మమ్మల్ని వదిలి వెళ్లిపోవడం నిజంగా బాధాకరమని, కన్నీరుమున్నీరయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here