అక్కడ సెల్ఫీ దిగితే మరణ శిక్ష ……..

0
28

పర్యాటకులకు హెచ్చరిక! ఆ బీచ్ లో సేల్ఫిలు తీసుకుంటే శిక్ష విధిస్తారు. సెల్ఫి తీసుకుంటే శిక్ష ఏంటి అనుకుంటున్నారా . అయితే మీరు థాయిలాండ్ లోని ఫూకేట్ ఐలాండ్ గురించి తెలుసుకోవాల్సిందే. ఇక్కడ ఉన్న మాయ్ ఖావో బీచ్ కు అనుకునే ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయం  రన్వే ఉంది. ఇక్కడ విమానాలు ఈ బీచుకు అత్యంత సమీపంలో నుంచి ప్రయాణం చేస్తాయి. దీంతో పర్యాటకులు తమ తలపై నుంచి వెళ్లే విమానాలతో సేల్ఫిలు దిగుతున్నారు. అయితే, ఇది పర్యాటకులకు ప్రమాదకరమే కాకుండా, విమానాలకు కూడా ముప్పు కలిగించవచ్చు అని ఫుకెట్ అధికారులు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో పర్యాటకులు ఆ ప్రాంతాన్ని కి రాకుండా కఠిన శిక్షలు, జరిమానాలు విధించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆ బీచ్ సేఫ్టీ జోన్ లోకి చేరుస్తామని ప్రకటించారు. ఆ నిబంధనలు అతిక్రమిచే వారికీ మరణ దండన లేదా జీవిత ఖైదు లేదా రూ. 70వేలు పైగా జరిమానాలు విడిచేందుకు సిద్ధమవుతున్నట్లు `ద సన్ ` పత్రిక వెల్లడించింది. అయితే, ఈ నిర్ణయాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. దీని వాళ్ళ పర్యాటక రంగం తీవ్ర ప్రభావం పడుతుందని తెలుపుతున్నారు. బీచ్ మీదుగా.. క్రింద నుంచి వెళ్లే విమానాలను చూసేందుకు చాలామంది ఇక్కడికి వస్తుంటారని తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో అటు పర్యాటక రంగానికి, ఇటు విమానాలకు విఘాతం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here