ఈ నెల 17 నుంచి ‘మీసేవ’ కేంద్రాల బంద్!

0
30
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మీ సేవ కార్యాలయాల నిర్వాహకులు నిరవధిక సమ్మె చేపట్టాలని నిర్యానించారు, ఈ మేరకు రాష్ట్ర మీసేవ నిర్వాహకుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. చాలీచాలని ఆదాయంతో, మీసేవ కేంద్రాల నిర్వహణ కష్టసాధ్యంగా మారిన నేపథ్యంలో విధిలేక సమ్మెబాట పడుతున్నట్టు పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం 11,054 మీసేవ కేంద్రాలను దశలవారీగా ఏర్పాటు చేశారు. వీటిలో నెలకు 500లోపు లావాదేవీలుండే కేంద్రాలు 4,530. మీసేవ ద్వారా అందించే సేవలకు నామమాత్రం కమీషన్‌ రావడంతో వాటి నిర్వహణ భారంగా మారింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండు వేల కేంద్రాలు మూతపడ్డాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 9,020 కేంద్రాలు ప్రజలకు సేవలందిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఏ సర్టిఫికేట్‌ కావాలన్నా ప్రజలు వెంటనే మీసేవ కేంద్రానికి వెళ్తున్నారు.
Related image
విద్యుత్‌ బిల్లులు, వివిధ రకాల పన్నులు, ప్రభుత్వ పరీక్షల ఫీజులు ఇలా దాదాపుగా వందల్లో సేవలు ప్రజలకు అందుతున్నాయి.  కమీషన్‌ చాలకపోవడంతో..  వివిధ రకాల కంపెనీల ద్వారా మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏపీ ఆన్‌లైన్, శ్రీవెన్, రామ్‌ ఇన్‌ఫో, కార్వీ, సీఎంఎస్‌ కంపెనీలు వీటికి సాంకేతిక సహకారాన్ని అందిస్తున్నాయి. అయితే తమ డిమాండ్లను నెరవేర్చాలని, కనీస వేతనం కూడా రాకపోవడంతో కేంద్రాల నిర్వహణ కష్టసాధ్యంగా మారి చాలా మంది అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అందుకే విధిలేని పరిస్థితుల్లో సమ్మెకు వెళ్తున్నాం అని, ప్రభుత్వం తమతో చర్చర్లు జరిపి మేలు చేకూరిస్తే సమ్మె విరమిస్తామని అంటున్నారు….