మెగాస్టార్ దర్శకుడి కన్నుమూత!

0
21
మెగాస్టార్ చిరంజీవితో మగధీరుడు, గ్యాంగ్ లీడర్, ఖైదీ నెంబర్ 786, బిగ్ బాస్ సినిమాలు తీసిన దర్శకుడు విజయబాపినీడు  నేడు హైదరాబాద్ లోని అయన స్వగృహంలో మృతి చెందారు. ఏలూరు వద్ద గల చాటపర్రు గ్రామంలో జన్మించిన బాపినీడు, అక్కడి సి ఆర్ రెడ్డి కళాశాలలో డిగ్రీ పూర్తి పూర్తి చేసారు. తరువాత జర్నలిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించి సినిమా రంగం మీద మక్కువతో రచయితగా దర్శకుడిగా మారారు. నిర్మాతగానూ విజయం సాధించారు.  తెలుగులో 1982లో దర్శకుడిగా పరిచయం అయిన ఆయన మగ మహారాజు, మహానగరంలో మాయగాడు, హీరోలాంటి వరుస విజయాలతో కమర్షియల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు.
Image result for VIJAYA BAPINEEDU
రాజేంద్ర ప్రసాద్‌ లాంటి కామెడీ హీరోలతోనూ వినోదాత్మక చిత్రాలను తెరకెక్కించి ఆకట్టుకున్నారు. ఇటీవల చిరంజీవి రీ ఎంట్రీ తరువాత ఓ సినీ వేదిక మీద మాట్లాడిన ఆయన.. మరోసారి చిరును డైరెక్ట్ చేయాలనుందన్నారు. అయితే ఆ కోరిక తీరకుండానే ఆయన తుది శ్వాస విడిచారు. తెలుగు సినిమాకు ఎన్నో కమర్షియల్ సక్సెస్‌లను అందించి, 22 సినిమాలకు దర్శకత్వం వహించిన బాపినీడు, చిరంజీవి టాప్‌ స్టార్‌గా ఎదగటంలో ఎంతో కీలక పాత్ర పోషించారనే చెప్పాలి. ఇక విజయ బాపినీడు మరణం పట్ల తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు నివాళులు అర్పిస్తున్నారు.