మేనల్లుడిపై మెగాస్టార్ షాకింగ్ కామెంట్స్… ఏమన్నారంటే?

0
101
మరొక మెగావారసుడు, మరియు చిరంజీవి గారి చిన్న మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నూతన సినిమా నేడు ప్రారంభమయింది. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇక నేడు ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ లోని చాలామంది వచ్చారు, ఇక ప్రత్యేక అతిథిగా విచ్చేసిన మెగాస్టార్, తన చిన్న మేనల్లుడిని ఉద్దేశించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
నాకు మైత్రి మూవీ మేకర్స్‌లాంటి మంచి నిర్మాణ సంస్థతో కలిసి పనిచేసే అవకాశం రాలేదు. కానీ ఆ అవకాశం నా మేనల్లుడికి తొలి చిత్రంతోనే దక్కింది. ఆ విషయంలో వాడెంతో అదృష్టవంతుడు. ఆదివారం విడుదలైన ప్రీలుక్‌ చూడగానే నాకు ‘రంగస్థలం’ గుర్తొచ్చింది. మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ చిత్రం ఎంతటి విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. అదే విధంగా వైష్ణవ్‌ కూడా మంచి హిట్‌ అందుకుంటాడని ఆశిస్తున్నాను’ అన్నారు. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ డెంగీతం అందిస్తున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here