పడుకొని ప్రచారం చేసిన ఎమ్మెల్యే

0
31

కర్నూల్ జిల్లా లోని ఓ ఎమ్మెల్యే స్టెచర్ పై పడుకొని మరి ప్రచారం  చేశాడు . నడవలేని పరిస్థితి గాయం వేధిస్తుంది. ఎండలు మండుతున్నాయి. అయినా కూడా ఓ ఎమ్మెల్యే అభ్యర్థి వెనకడుగు వేయాకుండా ప్రచారంలో పాల్గొన్నాడు. స్ట్రెచర్ పై పడుకొని కన్నీటి పర్యంతమవుతూ ప్రచారం  కొనసాగించాడు. కర్నూలు జిల్లా  మంత్రాలయం టీడీపీ అభ్యర్థి పాలకుర్తి తిక్కారెడ్డి బరిలో ఉన్నారు. మొదట్లో సైకిల్ యాత్ర, ర్యాలీలు, సభల పేరుతో కొన్ని గ్రామాలూ చుట్టేశారు.

ఇలా మంత్రాలయం మండలం ఖగల్లు గ్రామంలో ప్రచారానికి వెళ్లారు. అక్కడ వైసీపీ నాయకులూ ఏకపక్షంగా అడ్డుకునే యత్నంలో ఘర్షణ జరిగింది. అంగరక్షకులు గాల్లోకి కాల్పులు జరిపిన ఘటన లో తిక్కారెడ్డి కాలికి బులెట్ తగిలింది. గాయం అయ్యి తిక్క రెడ్డి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. చికిత్స చేయించు కొని ప్రత్యేక అంబులెన్సులో స్ట్రెచర్ పై వచ్చి నామినేషన్ వేశారు. అయన భార్య వెంకటేశ్వరమ్మ తో కలిసి ప్రధాన గ్రామాల్లో రోడ్ షోలకు వెళ్తున్నారు. `కొంగు చాచి అడుగుతున్న.. ప్రత్యర్ధులు నా భర్తను కాలు కదపకుండా చేశారు.. దయచేసి ఓటు వేయండి` అని ఆయన భార్య ప్రజలను అభ్యర్థిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here