హఠాత్తుగా ప్యాంటు జేబులో పేలిన మొబైల్…..వ్యక్తికి గాయాలు…. మ్యాటర్ కోసం ఇది చూడండి!

0
102
ఇటీవల కాలంలో సెల్ ఫోన్ ధరలు అందరికి అందుబాటులోకి రావడం అలానే ఇదివరకటితో పోలిస్తే ఇంటర్నెట్ ధరలు కూడా తగ్గుముఖం పట్టడంతో అందరూ సెల్ ఫోన్ ని విరివిగా వినియోగిస్తున్నారు. ఇక సెల్ వినియోగం తప్పనిసరి కావడంతో, వాటి వినియోగంపై కొన్ని జాగ్రతలు వహించాలని నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ కూడా  చాలామంది వాటిని పెడచెవిన పెడుతున్నారు. నిజానికి సెల్ అతిగా వాడితే, వాటి రేడియేషన్ వల్ల నిద్రలేమి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు తలెత్తుతాయని డాక్టర్లు కూడా చెపుతున్నారు. ఇక వీటన్నిటికంటే మరీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటంటే, సెల్ వినియోగం గురించి కొన్ని జాగ్రత్తలు మాత్రం తప్పక పాటించాలి. సెల్ ఫోన్ బ్యాటరీ ఎప్పటికపుడు ఛార్జింగ్ ఎంతవరకు ఎక్కుతుందో చెక్ చేసుకోవాలని, ఇక ఛార్జింగ్ సమయంలో సెల్ కనుక హీట్ వస్తే, దానిని ఒకసారి షాపుకు తీసుకెళ్లి చూపించాలనేది గుర్తుంచుకోవాలి. ఇక మరికొందరు అయితే తమ సెల్ ఫోన్ బ్యాటరీ ఉబ్బినప్పటికీ కూడా అది పట్టించుకోకుండా వాటినే వాడుతుంటారు. అయితే అటువంటి పట్టించుకోని కొందరి విషయంలో అవి పేలిన సందర్భాలు కూడా లేకపోలేదు.
Image result for cell phone bursted
ఇక ఇటువంటి ఘటన ఆంధ్రప్రదేశ్ లోని పలాసలో జరిగింది. మ్యాటర్ ఏంటంటే పలాసలో కాశీబుగ్గ మున్సిపాలిటీ లోని బ్రాహ్మణవీధికి చెందిన గోవిందపాత్రోకు చెందిన సెల్‌ఫోన్‌ గురువారం పేలిపోయింది. గోవిందపాత్రో తన ఫోన్‌కు రోజూలానే ఫుల్‌ చార్జింగ్‌ పెట్టి ఫ్యాంటు జేబులో పెట్టుకున్నాడు. అనంతరం పనుల కోసం తోటకు వెళ్లి ట్రాక్టర్‌ నడుపుతుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దంతో జేబులోని ఫోన్‌ పేలిపోయింది. ఫ్యాంటు నుంచి మంటలు రావడంతో తోటి కార్మికులు గుర్తించి అతడిని పట్టుకుని మంటలు అర్పారు. అయితే అప్పటికే అతడి తొడ భాగానికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆయన్ను స్థానికంగా వున్న ఒక పైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు. అనంతరం సెల్‌ఫోన్‌ కొనుగోలు చేసిన దుకాణానికి వెళ్లి విషయాన్ని చెప్పగా వారు తమకు సంబంధం లేదని చెప్పారు. దీనిపై వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించనున్నట్టు గోవిందపాత్రో చెప్పాడు. ఇక ప్రస్తుతం ఈ మ్యాటర్ వైరల్ గా మారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here