న్యూజిలాండ్ తో వన్డేలో బౌలర్ షమీ ప్రపంచ రికార్డు….!

0
74
న్యూజీలాండ్ తో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా అక్కడి మెక్‌లీన్ పార్క్ స్టేడియంలో ఇండియాతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో కివీస్‌కు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. భారత పేస్ బౌలర్ మహ్మద్ షమీ తాను వేసిన మొదటి ఓవర్‌లోనే వికెట్ తీశాడు. ఫలితంగా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్‌ను షమీ దెబ్బ కొట్టాడు. ఇటీవల మంచి ఫామ్‌ను కొనసాగిస్తున్న కివీస్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్‌(5)ను క్లీన్ బౌల్డ్ చేయడంతో వన్డేల్లో భారత్ తరపున అత్యంత వేగంగా వంద వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.
Image result for mohammed shami
షమీ 56 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించాడు. అతని తర్వాత ఈ జాబితాలో ఇర్ఫాన్ పఠాన్(59), జహీర్ ఖాన్(65), అజిత్ అగార్కర్(67), జవగల్ శ్రీనాథ్(68) ఉన్నారు. ప్రస్తుతం న్యూజీలాండ్ 31.5 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. మన్రో (0), విలియమ్సన్ (0)  రాస్ టేలర్ (24) టామ్ లతాం (11) హెన్రీ నికోల్స్ (12) మిచెల్ సాన్టనర్ (14) పరుగులకు అవుట్ అవ్వగా, ప్రస్తుతం కెప్టెన్ కేన్ విలియంసన్ (64) డౌగ్ బ్రేస్వెల్ (7) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here