నటుడు మోహన్ బాబు కు జైలు శిక్ష

0
62

హైదరాబాద్ : చెక్ బౌన్స్  విషయం లో  సినీ నటుడుమోహన్ బాబు పై ఎర్రమంజిల్ కోర్ట్ ఏడాది పాటు జైలు శిక్ష విధించింది . 2010 లో వై వి ఎస్ చౌదరి దర్శకత్వంలో ‘సలీం’  మూవీ చేసిన విషయం తెలిసిందే . అయితే చౌదరి రెమ్యూనరేషన్ గా  మోహన్ బాబు 40 లక్షల చెక్కును చౌదరికి అందించారు . తర్వాత వైవిఎస్ చౌదరి ఆ చెక్కును బ్యాంక్లో వెళ్లి చూడగా అది చెల్లకుండా బౌన్స్ అయ్యింది . ఇక ఈ విషయం పై అప్పుడే మోహన్ బాబు తో చర్చించినా ఫలితం ఉండక పోవడం తో 2010 లోనే వైవిఎస్ చౌదరి కోర్టుకెక్కారు .

ఇక దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత విచారణ జరిపిన కోర్టు  చౌదరికి అనుకూలంగా ఆదేశాలిస్తూ ఏ 1 గా ఉన్న లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ కు 10 వేలు  , ఏ 2 గా ఉన్న మోహన్ బాబుకు ఏడాది పాటు జైలు శిక్ష మరియు 41. 75 లక్షలు చెల్లించక పోతే అతనిపై కఠిన చర్యలు తప్పవని కోర్టు హెచ్చరించింది . ఏ తీర్పుపై మోహన్ బాబు ఇప్పటికే బెయిల్ కు అప్లై చేశారు . ఎన్నికల సమయం లో మోహన్ బాబు పై ఇలాంటి శిక్ష వైసిపి కి పెద్ద దెబ్బ అనే చెప్పుకోవచ్చు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here