ధోని ని తో సూపర్ సెల్ఫి దిగిన బామ్మ ….. !

0
34

టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఈ పేరు తెలియని ఎవరు ఉండకపోవచ్చు. ధోనికి  ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందొ అందరికి తెలిసిన విషయమే. ధోని కోసం అభిమానులు మైదాన్లో భద్రత సిబ్బందిని దాటుకొని మరీ వస్తుంటారు. ధోని కూడా వారిని నిరాశ పరచ కుండా .. వాళ్ళతో సరదాగా  ఉంటాడు. ఇటీవల ఓ అభిమాని మైదానంలో రాగానే ఆ అభిమానిని ఆటపట్టిస్తూ .. పట్టుకో చూద్దాం .. అంటూ ధోని పరుగులు పెట్టిన వీడియో సోషల్ మీడియా లో హల్  చల్ చేసింది. బుధవారం రాత్రి ముంబై వేదికగా జరిగిన మ్యాచ్ల్లో మరో సంఘటన చోటు చేసుకుంది.

మ్యాచ్ ముగిసిన తరువాత మైదానంలో అందరూ వెళ్లిపోయిన ఓ బామ్మా మాత్రం ధోనిని చూడాలంటూ ప్లకార్డుపట్టుకొని అక్కడే మైదానంలో వేచి ఉంది. డ్రెస్సింగ్ రూంలో నుంచి ఆ బామ్మా ను చూసి ఆమెను కలిసేందుకు మైదాంలోకి వచ్చాడు ధోని. ఆమెతో కాసేపు ముచ్చటించాడు. బామ్మా అభిమానం చూసి చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీ పై ఆటోగ్రాఫ్ చేసి భామకు  బహుమతిగా ఇచ్చాడు. దింతో పటు ధోనీనే స్వయంగా ఒక సెల్ఫీ దిగి ఇచ్చాడు. ఇప్పుడు ఇందుకు సంభందించిన వీడియో సోషల్ మీడియాలలో వైరల్ గా మారింది. మరోసారి ధోని తానేంటో నిరూపించుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here