రేపటి ముక్కోటి ఏకాదశి రోజున ఈ చిన్న పని చేస్తే సర్వపాపాలు పోయి, కుబేరులవుతారు

0
104
ఏటా తరచు వచ్చే ఏకాదశులకంటే ఒకింత ప్రత్యేకమైనది ముక్కోటి ఏకాదశి. ఇక ఈ పర్వదినం నాడు శ్రీ మహా విష్ణువు మూడు కోట్ల దేవతలతో కలిసి గరుడ వాహనంపై భూలోకానికి వచ్చి, నేడు సక్రమంగా ఏకాదశి వ్రతాన్ని మరియు పూజను ఆచరించిన వారి కోరికలు తీర్చి, వారి పాపాలను ప్రక్షాళన చేస్తాడని ప్రతీతి. ఇక ఈ పర్వదినం నాడు ఆలయాల్లో ఉత్తరద్వార దర్శనం భక్తులకు కల్పించడం జరుగుతుంది. ఇక తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఈ పర్వదినాన భక్తులకు వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారి దర్శనాన్ని కల్పిస్తారు. ఇక ఈ ఏకాదశి ఎలా ఏర్పడింది అంటే, పూర్వం మొర అనే రాక్షసుడు ముల్లోకాలను అల్లకల్లోలం సృష్టిస్తుంటే, అతడి ఆగడాలను భరించలేని దేవతలందరూ కలిసి వెళ్లి శ్రీ మహావిష్ణువుకు అతడిని సంహరించమని అర్థిస్తారు.
అయితే వారికి అభయమిచ్చిన విష్ణు మూర్తి, మొర కోసం భూమిపైకి వస్తాడు. అయితే విష్ణు మూర్తి ఆగమనంతో భపడిన మొర, సముద్రగర్భాన దాక్కుని తలదాచుకుంటాడు. అయితే భూమిపైకి వచ్చిన విష్ణు మూర్తి, ఒక గుహలోకి వెళ్లి అక్కడే నిద్రస్తాడు, ఆ విషయం తెలుసుకున్న మొర, తెలివిగా వచ్చి విష్ణువును సంహరించడం కోసం కత్తి ఎత్తుతాడు, అయితే అది గ్రహించిన విష్ణుమూర్తి నుండి ఉద్భవించిన ఒక శక్తి, అతడిని భస్మం చేస్తుంది. ఇక కాసేపటికి నిద్రలేచిని విష్ణుమూర్తి, ఆమె చేసిన పనికి సంతోషించి, ఆమెకు ఏకాదశిగా నామకరణం చేస్తాడు. ఎవరైతే ఈ పర్వదినం నాడు ప్రొద్దున్నే నిద్రలేచి తలస్నానమాచరించి, ఇంటికి పచ్చటి తోరణాలతో అలంకరించి, శ్రీవారి పటానికి పూలమాల వేసి, జాజిపూల అలంకరణ అలానే కలశంలో టెంకాయను పెట్టి ఎంతో నిష్ఠతో శ్రీహరిని పూజిస్తారో వారికి సకల సిరులు లభిస్తాయి.
అంతేకాక పూజ అయ్యాక ఏకభుక్తం చేసి, రాత్రికి భోజనానంతరం జాగరణ చేసి స్వామి వారిని పూజిస్తే మన కోరికలు కూర తీరుతాయి. ఇక ఏకాదశి నాడు నిష్టగా స్వామిని పూజించి, పైన చెప్పిన నియమాలు ఆచరిస్తారో వారికీ సకల సౌభాగ్యాలు, మరియు సంపదలు కలగడమే కాక పాప ప్రక్షాళన కూడా జరుగుతుందట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here