జగిత్యాలలో దారుణం అర్ధరాత్రి కౌన్సిలర్ పై హత్యాయత్నం……

0
34

తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు  తాజాగా మండల ఎన్నికలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా జగిత్యాల జిల్లా 15 వార్డు కౌన్సిలర్ పై నిన్న అర్ధరాత్రి అతనిపై హత్యాచారానికి పాల్పడినారు. కాంగ్రెస్ పార్టీ 15 వ వార్డు కౌన్సిలర్ పై ఆరుబయట నిద్రపోతూవుండగా ఐదుగురు దుండగులు కత్తులతో అతనిపై దాడి చేశారు. నిద్రలో ఉండగా దాడి చేయడంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆయన గట్టిగ అరవడంతో  దుండగులు పరారయ్యారు. కుటుంబ సభ్యులు ఆయన్ని జిల్లా హాస్పిటల్ కి తరలించారు.  ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెపుతున్నారు.పాత కక్షల తోనే ఈ దాడి చేసినట్టు కుటుంబ సభ్యులు ఆరో పిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. ఆయన ఇంట్లో ఎలాంటి సీసీ కెమెరా లేనందువలన దర్యాప్తు కొంచెం సమయం పడుతుందని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here