నాకు పెళ్ళైన విషయం నా ఫ్యాన్స్ కి కూడా తెలియదు : షాకిచ్చిన బాలకృష్ణ హీరోయిన్!

0
140
గతకొద్ది కాలంగా సినిమా నటులు ఎక్కువగా ప్రేమ వివాహాలవైపే మొగ్గుచూపుతున్నారు. ఇక ఇటీవల టాలీవుడ్ జంట నాగచైతన్య మరియు సమంత, రణవీర్ సింగ్ దీపికా పడుకొనే, విరాట్ కోహ్లీ అనుష్క శర్మ వంటివారు ప్రేమించి వివాహాలు చేసుకున్నారు. అయితే ఇటువంటి వారికోవాలోనే మరొక బాలీవుడ్ హీరోయిన్ చేరింది. తెలుగులో లెజెండ్ సినిమాతో  ఎంట్రీ ఇచ్చిన రాధికా ఆప్టే, ఆ సినిమా విజయం తరువాత ఇక్కడి ప్రేక్షకుల్లో కూడా మంచి పేరు సంపాదించింది. ఇకపోతే ఆమెకు బోల్డ్ యాక్టరస్ గా పేరుంది. అక్కడక్కడా న్యూడ్ గా కూడా ఈమె నటించిన సందర్బాలున్నాయి. రాధిక ఆప్టే తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించిన విషయమై క్లారిటీ ఇచ్చింది. తనకు 8 ఏళ్ల క్రితం వివాహం అయ్యిందని చెప్పుకొచ్చింది. నాకు పెళ్లి అయిన విషయం ఎప్పుడు కూడా దాచేందుకు ప్రయత్నించలేదని, అయితే నాకు పెళ్లి అయిన విషయం నాతో వర్క్ చేసిన దాదాపు అందరికి కూడా తెలుసంది. కాని నా అభిమానుల్లో చాలామందికి ఈ విషయం తెలియదని చెప్పుకొచ్చింది. 2012లో లండన్ కు చెందిన బెనెడిక్ట్ తో వివాహం అయ్యిందన్న రాధిక ఆప్టే, అప్పటి నుండి కూడా మేమిద్దరం అప్పుడప్పుడు మాత్రమే కలుసుకుంటూ విడివిడిగానే ఉంటున్నామని చెప్పుకొచ్చింది.
Image result for radhika apte
నాకు ఆయన పూర్తి స్వేచ్చను ఇచ్చారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న మేమిద్దరం, వృత్తి రీత్యా ప్రస్తుతం విడి విడిగా మా జీవితాలను గడుపుతున్నాం. ఆయన ఒక సంగీత కళాకారుడు, లండన్ కు నేను వెళ్లడం కుదరకపోవడంతో, తను ఇండియాకు రావడం జరుగుతుందని చెప్పుకొచ్చింది. అందరి భార్యభర్తల మాదిరిగానే మేము కూడా సరదాగా అప్పుడప్పుడు గొడవలు పడుతూ ఉంటామని చెప్పుకొచ్చింది.  ఈ ఎనిమిది సంవత్సరాల్లో మా ఇద్దరి మద్య ప్రాధాన్యత అనే ప్రస్థావన రాలేదు. ఇద్దరం కూడా పూర్తి అంగీకారంతో కెరీర్ లో ముందుకు వెళ్తున్నాము. నాకు పెళ్లి అయిన విషయం ఇప్పటికి కూడా చాలా మందికి తెలియదు. చాలా మంది నీకు పెళ్లి అయ్యిందా అంటూ ప్రశ్నిస్తారు. ఎనిమిది సంవత్సరాల క్రితం రిజిస్ట్రర్ మ్యారేజ్ చేసుకున్న మేము కలిసి వేడుకలకు వెళ్లడం ఫొటోలు దిగడం చాలా తక్కువ. అందుకే మా పెళ్లి గురించి ఎక్కువగా ప్రచారం జరగలేదు. ఆ కారణంగానే ఎక్కువ శాతం మందికి నాకు పెళ్లి అయిన విషయమే తెలియదు అంటూ తన ఫ్యాన్స్ కి షాకిచ్చింది రాధికా. ఇక ప్రస్తుతం ఈ విషయం బాలీవుడ్ మీడియా వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here