తన వివాదాస్పద వ్యాఖ్యలపై క్షమాపణలు కోరిన నాగబాబు!

0
84
మెగాబ్రదర్ నాగబాబు గతకొద్దిరోజులుగా నందమూరి బాలకృష్ణ, అలానే చంద్రబాబు, జగన్ ల వ్యవహారశైలిపై విరుచుకుపడుతూ తన సోషల్ మీడియా మాధ్యమం ఫేస్ బుక్ అలానే యూట్యూబ్ ద్వారా పోస్టులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే మొన్న టిడిపి అధినేత మరియు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై అయన చేసిన వ్యాఖ్యల సందర్భంగా, ఒక ప్రముఖ తెలుగు మీడియా ఛానల్ చంద్రబాబు మరియు లోకేష్ చేసిన వ్యాఖ్యలకు భట్రాజుల్లా వ్యవహరిస్తూ వారిని వెనకోసుకొచ్చి భజన చేయడం వంటి విషయాలను ప్రస్తావించారు.
Image result for నాగబాబు
అయితే ఆ విషయమై నేడు అయన తన ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ చేస్తూ, భట్రాజు పొగడ్తలు అనే పదాన్ని ఉపయోగించడంతో ఆ కమ్యునిటీ మనోభావాలు దెబ్బతినకుండా దిద్దుబాటు చర్యల్ని చేపడుతూ.. అసలు ఆ సంఘం ఒకటి ఉన్నదని నాకు తెలియదు అందుకే పొరపాటున నా నోటి నుండి ఆ పదం వచ్చేసింది క్షమించాలని కోరుతూ ఫేస్ బుక్‌ ద్వారా క్షమాపణలు కోరుతున్నానని అయన అన్నారు. అయితే నాగబాబు క్షమాపణలు కోరడంపై కొందరు నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తుండగా, మరికొందరు మాత్రం, ఈ విధంగా ఇతర కులాల వ్యక్తుల్ని కించపరచడం సరైనది కాదని ఆయన పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా నాగబాబు పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here