రామ్ చరణ్ పై నాగబాబు షాకింగ్ కామెంట్స్!

0
74
మెగా ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయి వారి మధ్య కొంత కోల్డ్ వార్ జరుగుతుంది అని కొన్ని మీడియా ఛానళ్లలో అప్పుడపుడు కొన్ని వార్తలు వస్తూ పుకారవుతుంటాయి. అయితే వాటన్నిటినీ ఎప్పటికపుడు పటాపంచలు చేస్తూ ఆ ఫ్యామిలీ వారందరూ, మేము ఎప్పటికీ అందరం ఒక్కటే అంటూ తెల్పుతూ కొన్ని వ్యాఖ్యలు మరియు చర్యలతో నిరూపించుకుంటూ వుంటారు ఆ ఫ్యామిలీ వారు. ఇక ఆ విధంగా కొద్దిరోజులుగా నాగబాబు, మరియు చిరంజీవికి మధ్య విబేధాలు వచ్చాయి అనే వార్తలు ఒట్టి గాసిప్పులు అనడానికి నిదర్శనంగా నిన్న చరణ్, తన బాబాయి తనయుడు వరుణ్ నటించిన అంతరీక్షం సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు స్పెషల్ గెస్ట్ గా వెళ్లి అటుంవటి పుకార్లకు చెక్ పెట్టాడు. అంతేకాకాదు ఆ వేడుకలో బాబాయి మరియు సోదరుడిపై పొగడ్తల జల్లు కురిపించిన చరణ్, వరుణ్ ఎప్పుడూ తాను చేసే సినిమాల విషయంలో పడే కష్టం అంత ఇంతా కాదని, ఎలాగైనా దర్శకుడు చెప్పినదానికి నూటికి నూరుశాతం న్యాయం చేయాలనీ భావిస్తాడని అన్నాడు. ఇక ఈ సినిమా ట్రైలర్ ని ఇటీవల వరుణ్ తనకు చూపించాడని, అయితే ఇటువంటి కొత్త తరహా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు తెలుగులో వస్తే బాగుంటుందని తాను చెప్పానని చరణ్ అన్నారు. ఇక బాబాయి కూడా వరుణ్ ని ఎంతో గొప్పగా పెంచారని, అయన తలెత్తుకునేలా ఈ సినిమాలో వరుణ్ నటించాడని చరణ్ ఆయనని ప్రశంసించారు.
ఇక తమపై చరణ్ చేసిన కామెంట్స్ పై స్పందించిన నాగబాబు, నిజానికి అన్నయ్య గారిలానే చరణ్ కూడా తమ వారిని ఆదుకోవడంలో ముందుంటాడని, నిజానికి తనకు ఆరెంజ్ సినిమా సమయంలో వచ్చిన నష్టాన్ని అర్ధం చేసుకుని అన్నయ్య నుండి సాయం అందుకోవడానికి చరణ్ కూడా కారణమని అప్పటి ఘటనను గుర్తు చేసుకున్నారు. ఈ విధంగా తాము పిలవగానే ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా ఈ వేడుకకు విచ్చేసి వరుణ్ కు బాసటగా నిలిచిన చరణ్ కు తన తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు నాగబాబు. ఇక వరుణ్ తనకు వీలయితనంతగా కొత్త కొత్త సినిమాలతో టాలీవుడ్ లో మంచి హీరోగా దూసుకెళ్తున్నాడని, ఈ సినిమా కోసం వరుణ్ పడ్డ కష్టం తనకు తెలుసునని, ఇక సంకల్ప్ రెడ్డి సినిమాను ఎంతో జాగ్రత్తగా తెరకెక్కించారని, తప్పకుండ వారి కష్టం వృధా కాకుండా సినిమా తప్పక విజయం సాదిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here