బాలకృష్ణ గారిని బ్లడ్, బ్రీడ్ గురించి నాగబాబు చేసిన సంచలన వ్యాఖ్యలు!

0
76
ప్రస్తుతం మెగా బ్రదర్ నాగబాబు యువరత్న నందమూరి బాలకృష్ణ గారిని పరోక్షంగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే నిన్న అయన తాను చేసిన కామెంట్స్ పై ప్రజలకు వీడియోల రూపంలో వివరణ ఇవ్వడం మొదలెట్టారు. ఇక ఇప్పటికే బాలకృష్ణ గారు రెండు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్స్ ప్రస్తావించిన నాగబాబు, నేటి ఉదయం ఆయనకు మూడవ ప్రశ్న సంధించారు. గతంలో పవన్ కళ్యాణ్ పార్టీ పై బాలయ్య మాట్లాడుతూ, ఒక సందర్భంలో అమితాబ్ బచ్చన్ రాజకీయాల్లోకి వచ్చాడు, ఏమి పీకాడు, తరువాత చిరంజీవి పార్టీ పెట్టి పీకింది ఏంటి, ఇపుడు ఈయన వచ్చి చేసేది ఏమి లేదు,,,, ఇక మా గురించి అంటారా, మేము వేరు మా బ్లడ్ వేరు అని అన్న విషయాన్ని ప్రస్తావించారు…
Image result for nagababu balakrishna
మీరు ఏమైనా ఆకాశంలోనుండి ఊడి పడ్డారా, లేక మీకు ఏమైనా అతీత శక్తులు ఉంటాయా అని అన్నారు. ఇక కొన్ని ఏళ్ల క్రితం ఇంగ్లాండ్, ఆస్ట్రియాల్లో ఇటువంటి నిరంకుశ బ్లడ్, బ్రీడ్ వంటి పదాలు శృతిమించబట్టే, ఆ తరువాత అక్కడ ప్రజాస్వామ్య పాలన వచ్చిందని, ఈ విషయాన్నీ బాలయ్య గుర్తుంచుకోవాలని అన్నారు. ఇక తమ కుటుంబం మొత్తం ఎంతో సౌమ్యంగా ఇటువంటి వాటిపై ఇప్పటివరకు స్పందించలేదని, కానీ ఇప్పుడు బాధ తట్టుకోలేక బయటకు వచ్చి మాట్లాడుతున్నామని అన్నారు. కాగా నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలు మరొక్కసారి టాలీవుడ్ లో సంచలనాన్ని రేపుతున్నాయి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here