మరొక్కసారి చంద్రబాబుని టార్గెట్ చేసిన నాగబాబు!

0
78
ఇప్పటికే గత కొద్దిరోజులుగా జగన్, చంద్రబాబు, లోకేష్ లపై తనదైన స్టయిల్లో ఫేస్ బుక్ వేదికగా కామెంట్స్ చేస్తూ వస్తున్న మెగాబ్రదర్ నాగబాబు, తాజాగా మరొక్కసారి ఏపీ సీఎం చంద్రబాబుపై సెటైర్ వేశారు. ఇటీవల అసెంబ్లీలో చంద్రబాబు బీజేపీ నేతలపై ఫైర్ అవుతున్న వీడియోను తన అఫీషియల్ ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసిన నాగబాబు, చంద్రబాబు రక్తం మరగడానికి నాలుగున్నరేళ్లు పట్టిందంటూ సెటైర్ వేశారు. ‘చూడండిరా పాలు మరిగిపోతున్నాయి చూడండి’ అని పాలు మరిగే దృశ్యాన్ని చూపిస్తూ,
Image result for nagababu chandrababu
ఆ తరువాత చంద్రబాబునాయుడు ఇటీవల అసెంబ్లీలో బీజేపీ నేతలపై ఫైర్ అవుతున్న వీడియోను చూపించారు. అనంతరం నాగబాబు మాట్లాడుతూ, ‘చూశారుగా, పాలు మరగటానికి నాలుగున్నర నిమిషాలు పట్టింది. అదే మరి మన సీఎంచంద్రబాబు గారి రక్తం మరగటానికి నాలుగున్నరేళ్లు పట్టింది. ఎక్కువ మంట పెడితేనే పాలు మరుగుతాయి. ఎలక్షన్లు వస్తేనే మన చంద్రబాబు నాయుడుగారి రక్తం మరుగుతుంది అంటూ సెటైరికల్ గా టీడీపీ మరియు చంద్రబాబుపై బాంబు పేల్చారు నాగబాబు. కాగా నాగబాబు పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది…..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here