నిహారిక పెళ్లిపై నాగబాబు అలా అన్నారేంటి !!

0
48
మెగా బ్రదర్ నాగబాబు గతకొద్దిరోజులుగా బాలకృష్ణ, జగన్, చంద్రబాబులపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఇక ఏదైనా కొంత ముక్కుసూటిగా మాట్లాడే అలవాతున్న నాగబాబు, నిన్న ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కూతరు నిహారిక పెళ్లి గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. నేను రెండు మూడేళ్లలో పెళ్లి చేస్తానని నిహారికకు ముందే చెప్పానని, అయితే తన కోరిక మేరకు సినిమాల్లో నటిస్తానంటే ఒప్పుకున్నానని నాగబాబు అన్నారు. సినిమాల్ని పక్కన పెట్టి వెబ్ సిరీస్ లో నటిస్తే చాలని అంటే, దానికి తను కూడా ఓకే చెప్పిందని అన్నారు. నిహారికకు బయటి సంబంధాలు చూస్తున్నాం. మంచి అబ్బాయి కుదిరితే వెంటనే పెళ్లి చేసేయాలనుకుంటున్నాం. 2018 వరకు నిహారికకు సమయం ఇచ్చాం.
nagababu about her daughter niharika marriage
ఇక ప్రస్తుతం అది పూర్తయింది. ఇక ఈ ఏడాది పెళ్లి చేయాలనే నిర్ణయానికి వచ్చాం. మా కులంలో మంచి అబ్బాయి దొరికితే ఓకే, లేదంటే ఇతర కులాల్లోని వారైనా మంచి గుణం, తనను అర్ధం చేసుకునే మంచి మనసు వున్న అబ్బాయి తారసపడితే తప్పకుండా అతనికిచ్చి పెళ్లి చేస్తాను అన్నారు. ఆ విషయాంలో మాకుటుంబానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఖరాకండిగా చెప్పారు. ఇప్పటికే సినిమాల ఎంపిక విషయంలో నిహారిక ఎంతో జాగ్రత్తగా ఉంటోంది. తను సినిమాల్లో నటించే సమయం అయిపోయిందని ఇక పెళ్లి చేస్తానని అసలు విషయం చెప్పేశారు మెగా బ్రదర్. కాగా ప్రస్తుతం ఈ మ్యాటర్ టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా చర్చనీయాంశంగా మారింది….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here