చిరు ఒక చోటారాజన్, అరవింద్ ఒక దావూద్ ఇబ్రహీం అంటున్న నాగబాబు…వైరల్ అవుతున్న న్యూస్!

0
83
మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు ఇటీవల కొద్దిరోజులుగా సోషల్ మీడియా వేదికల్లో బాలకృష్ణ, జగన్, లోకేష్, చంద్రబాబు వంటివారిపై తనదైన శైలిలో విరుచుకుపడుతూ వీడియోలు పోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే నాగబాబు నేడు ఒక మీడియా ఇంటర్వ్యూ లో చిన్న సినిమాల విషయమై మాట్లాడుతూ, కొందరు అంటున్న ప్రకారం సినిమా ఇండస్ట్రీలోని సురేష్ బాబు ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ ఈ నలుగురు, అలానే మరోవైపు డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు, అల్లు అరవింద్ వంటివారిని మించిన పెద్ద మాఫియా ఎవరుంటారని చమత్కరించారు. తామే పెద్ద మాఫియా అని, తన అన్నయ్య చిరంజీవి ఓ చోటా రాజన్ అని, అల్లు అరవింద్ ఓ దావూద్ ఇబ్రహీం అంటూ చిన్న సినిమాల నిర్మాతలు చేస్తున్న విమర్శలపై వ్యంగ్యాస్త్రాలు పేల్చారు. చిన్న సినిమాలు విడుదల కాకపోవడమనేది డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించిన అంశమని నాగబాబు అన్నారు.
Image result for naga babu
ఫలానా వాళ్ల సినిమా విడుదల అవుతోంది, ఆ సినిమాను విడుదల కాకుండా ఆపండని సినీ పెద్దలు ఎవరూ అనరు సరికదా, ఆ విధంగా వేరొకరి నోటి వద్ద అన్నం లాక్కుని తినేవారు ఇక్కడ ఎవరు లేరని చెప్పారు. ఈ నలుగురి చేతుల్లోనే పరిశ్రమ ఉన్నట్టయితే, మరి వారికి కూడా ఫ్లాప్ లు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. నిజానికి  బిజీ టైమ్ లోనే సినిమాను విడుదల చేయాలని అందరూ అనుకుంటారని… కానీ, ఎక్కువ డబ్బు వచ్చే సినిమానే డిస్ట్రిబ్యూటర్లు తీసుకుంటారని చెప్పారు. కథలో దమ్ముంటేనే సినిమాలు ఆడతాయని అన్నారు. ప్రస్తుత కాలంలో 3 నుంచి 4 వారాలకు మించి ఆడే దమ్ము పెద్ద సినిమాలకు కూడా లేదని చెప్పారు. కాగా నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here