బాలయ్యకు మరొక కౌంటర్ ఇచ్చిన నాగబాబు……చూస్తే షాక్ అవ్వాల్సిందే|telugugaramchai

0
85
ఇటీవల కొద్దిరోజుల క్రితం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా హిందూపూర్ ఎమ్యెల్యే నందమూరి బాలకృష్ణ దేశభక్తి గీతమైన సారే జహాఁ సే అచ్చా ని తప్పుగా పాడి అందరి దృష్టిలో చులకన అయిన విషయం తెలిసిందే. ఇక బాలయ్య  పాడిన పాటకు అప్పటినుండి సోషల్ మీడియా వేదికల్లో ఆయనపై  విపరీతంగా ట్రోల్స్ మొదలయ్యాయి. ఇక మరోవైపు ఇటీవల బాలయ్య తనకు పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదు అంటూ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మెగాబ్రదర్ నాగబాబు ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తనకు బాలకృష్ణ గారు అంటే ఎవరో తెలియదని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక అప్పటినుండి మెగా మరియు నందమూరి ఫాన్స్ మధ్య వార్ సోషల్ మీడియాలో మరింత ముదిరింది. ఇక నేడు నాగబాబు సోషల్ మీడియా మాధ్యమంలో ఒక బాలుడు సారె జహాఁ సే అచ్చా ని స్పష్టంగా ఏ మాత్రం తడబడకుండా పాడుతున్న వీడియోని పోస్ట్ చేయడం జరిగింది.
అయితే ఆ వీడియోని నాగబాబు గారు, బాలకృష్ణ గారికి కౌంటర్ ఇచ్చినట్లుగానే భావిస్తున్నారు మెగా అభిమానులు. ఇక కాసేపటిక్రితం నాగబాబు పెట్టిన ఈ వీడియోపై మెగా అభిమానులు సమర్థిస్తుండగా, నందమూరి అభిమానులు మాత్రం నాగబాబు గారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వీడియో పోస్ట్ ఒకరకంగా ఆ రెండు కుటుంబాల అభిమానుల మధ్య వివాదాన్ని మరింత రాజేసినట్లయింది. అయితే  బాలుడు ఎంతగొప్పగా జాతీయ గీతాన్ని పాడాడు అని అందరికి తెలియచెప్పడానికే నాగబాబు గారు వీడియో పోస్ట్ చేయడం జరిగిందని మెగా అభిమానులు చెపుతుంటే, నందమూరి ఫ్యాన్స్ మాత్రం ఇది ముమ్మాటికీ బాలకృష్ణ గారిని కించేపరచడానికి అయన పోస్ట్ చేసిన వీడియో అని వారు నాగబాబుని వ్యతిరేకిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ వీడియో టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా వైరల్ గా మారి సంచలనం సృష్టిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here