షూటింగ్ లో తీవ్రంగా గాయపడ్డ హీరో నాని

0
91

గత కొన్ని రోజులుగా వరుస ప్లాప్ లతో గాడి తప్పిన హీరో నాని . ఎంసీఏ మూవీ తర్వాత ఈ హీరో కి ఒక్క హిట్ కూడా లేదు . తన స్వశక్తి తో ఇండస్ట్రీ లో తనకంటూ ఒక గుర్తింపు పొందిన వారిలో నాని ఒకరు . ప్రస్తుతం నాని జెర్సీసినిమా షూటింగ్ లో బిజీ బిజీ గా గడుపుతున్నారు . అయితే ఈ సినిమా క్రికెట్ ఆధారంగా వస్తుండటం తో నాని క్రికెటర్ గా కనువిందు చేయనున్నాడు . అప్పట్లో కబడ్డీ ప్లేయర్ గా నటించిన భీమిలి కబడ్డీ జట్టు ఘన  విజయాన్నే సొంతం చేసుకుంది . అదే విధంగా వస్తున్న ఈ మూవీ పై నాని అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి .

నానికి కూడా గత కొన్ని రోజులుగా  హిట్ లేకపోవడం తో ఈ మూవీ కీలకంగా మారనుంది ఎలాగైనా సరే ఈ విజయం తో మళ్ళీ  ఫార్మ్ లోకి రావాలని చూస్తున్నాడు నాని . అయితే సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో బౌలర్ వేసిన బంతి నేరుగా నాని ముక్కుకు బలంగా తాకడం తో ముక్కుకు తీవ్రగాయమైంది . స్పందించిన  టీం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు . దెబ్బ అంత గట్టిగా తగలక పోవడం తో పెద్ద ప్రమాదమే తప్పింది . ఈ ప్రమాదానికి సంబందించిన వీడియో ఈ రోజు జెర్సీ టీం విడుదల చేసింది . మరి ఈ సంఘటన  ఎప్పుడు జరిగిందనేది మాత్రం క్లారిటీ లేదు . ఏది ఏమైనా నాని జెర్సీ మూవీ మంచి విజయాన్ని అందించాలని కోరుకుందాం . ఈ రోజు ఉదయం జెర్సీ టీజర్ రిలీజ్ విడుదలై మంచి వ్యూస్ నే సొంతం చేసుకుంది .
వీడియో కోసం ఈ లింక్ ను ఓపెన్ చెయ్యండి :

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here