అదరగొడుతున్న నాని ‘జెర్సీ’ మూవీ న్యూ పోస్టర్!

0
88
నాచురల్ స్టార్ నాని హీరోగా ఇటీవల అక్కినేని నాగేశ్వరరావు గారి మనుమడు సుమంత్ హీరోగా నటించిన మళ్ళి రావా సినిమాతో డైరెక్టర్ గా తన ప్రతిభను నిరూపించుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న కొత్తం సినిమా జెర్సీ. ఇక ఇటీవల షూటింగ్ ప్రారంభించుకున్న ఈ ఫస్ట్ లుక్ టీజర్ ని కొత్త ఏడాది కానుకగా జనవరి ఒకటి 2019 రోజున సినిమా యూనిట్ విడుదల చేయనుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఒక పోస్టర్ ని నేడు విడుదల చేసింది చిత్ర యూనిట్.
ఇందులో క్రికెటర్లు వేసుకున్న కొన్ని జెర్సీలు కప్ బోర్డు లకు తగిలించి ఉండడం గమనించవచ్చు. కాగా ఈ సినిమా క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇక కాసేపటి క్రితం విడుదలైన ఈ సినిమా పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా  మారింది. ఇక ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాని సూర్య దేవర నాగవంశి తన సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. కాగా ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ పోస్టర్ పై పలువురు నెటిజన్లు పోస్టర్ బాగుంది అంటూ తమ అభిప్రాయాలను తెలియచేస్తున్నారు. అయితే నాని గత రెండు సినిమాలు కృష్ణార్జున యుద్ధం, దేవదాసు సినిమాలు పెద్ద విజయాన్ని సాధించకపోవడంతో ఈ సినిమాపై నాని అభిమానులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి మీరు కూడా ఈ పోస్టర్ పై ఒక లుక్ వేయండి మరి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here