నాని ‘జెర్సీ’ టీజర్ రివ్యూ : ఎలా ఉందంటే?

0
48
నాచురల్ స్టార్ నాని ఇటీవల నటించిన కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో ఇకపై చేయబోయే సినిమాల విషయమై జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇక ప్రస్తుతం అయన మళ్ళి రావా సినిమా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో జెర్సీ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కన్నడ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్‌‌‌ నానితో జోడి కట్టారు. ఇక అనిరుధ్‌ బాణీలు అందిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని కాసేపటి క్రితం యూట్యూబ్ లో విడుదల చేసింది చిత్ర యూనిట్…
Image result for jersey movie
ఇక టీజర్ లో నీ వయసు ఇప్పుడు 36 అర్జున్‌, అది ప్రొఫెషనల్‌ స్పోర్ట్స్‌ నుంచి రిటైర్‌ అయ్యే వయసు అనే డైలాగ్‌తో టీజర్‌ ప్రారంభమైంది.  అలానే పిల్లల్ని ఆడించే వయసులో మనకు ఆటలు ఎందుకు బావా అని మరో వ్యక్తి నానితో అంటున్న డైలాగ్, అలానే ఎంత ప్రయత్నించినా ఇప్పుడు నువ్వు ఏం చేయలేవు అని ఓ మహిళ నానితో కోపంగా అంటున్న డైలాగు ఆకట్టుకున్నాయి. ఇకపోతే టీజర్ చివరిలో ‘ఆపేసి ఓడిపోయిన వాడు ఉన్నాడు కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయిన వాడు లేడు’ అంటూ నాని చెప్పిన డైలాగ్‌ మొత్తం టీజర్ కే హైలైట్‌గా నిలిచింది. ఆసక్తికరమైన క్రికెట్ కథాంశంతో ఈ సినిమాను తీస్తున్నారు. ఇక సంగీత దర్శకుడు అనిరుధ్‌ చక్కటి సంగీతం అందించినట్లు టీజర్‌ను చూస్తే తెలుస్తోంది‌. ఏప్రిల్‌లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ టీజర్ టాలీవుడ్ వర్గాల్లో వైరల్ గా మారింది…