ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న నాని, జెర్సీ మూవీ న్యూ పోస్టర్!

0
69
నాచురల్ స్టార్ గా పేరుగాంచిన నాని, ప్రస్తుతం క్రికెట్ నేపథ్యంలో రూపొందుతున్న జెర్సీ మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు కొత్త దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా, సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇకపోతే ఇప్పటికీ విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టింది.
ఇక వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ ని చిత్ర బృందం ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14 న విడులా చేయనుంది. ‘అదేంటోగాని ఉన్నపాటుగా’  అనే పల్లవితో సాగే ఆ సాంగ్ పోస్టర్ ని కాసేపటి క్రితం చిత్ర యూనిట్ తమ అధికారిక సోషల్ మీడియా మాధ్యమాల్లో విడుదల చేయడం జరిగింది. ఇక ఈ పోస్టర్ కు నాని ఫ్యాన్స్ నుండి మంచి స్పందన లభిస్తోంది. కాగా ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియా వేదికల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ పోస్టర్ పై ఒక లుక్ వేయండి…..

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here