నాగబాబుకు గట్టి కౌంటర్ ఇచ్చిన బాలకృష్ణ కూతరు బ్రాహ్మణి…..మ్యాటర్ తెలిస్తే షాక్ అవుతారు

0
81
సినిమా పరిశ్రమలో ఒకరిపై మరొకరు కొన్ని విషయాల్లో అసహనం వ్యక్తం చేయడం అక్కడక్కడా చూస్తుంటాం. ఇక మరికొందరైతే తమకు నచ్చని ఇతర నటుల విషయమై కొంత జాగ్రత్తతో వ్యవహరిస్తూ అటువంటి వారికీ దూరంగా ఉంటూ వస్తుంటారు. ఇక టాలీవుడ్ లోని ప్రస్తుతం పెద్ద ఫ్యామిలీలైన మెగా మరియు నందమూరి ఫ్యామిలిల మధ్య కొంత కోల్డ్ వార్ నడుస్తున్న విషయం ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగు వారందరికీ కూడా తెలిసిన విషయం. ఇకపోతే ఇటీవల కొన్నాళ్లుగా నందమూరి బాలకృష్ణ టీడీపీ తరపున మాట్లాడుతూ కాంగ్రెస్ లో వ్యవహరిస్తున్న చిరంజీవి, అలానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్ గా చేసిన కొన్ని ఆరోపణలకు మొన్న మెగా బ్రదర్ నాగబాబు వెరైటీగా సమాధానమిచ్చారు. ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు బాలయ్య అంటే ఎవరో తెలియదని, అయితే సీనియర్ నటులు మరియు నిర్మాత దివంగత బాలయ్య గారి గురించి మాత్రమే తనకు తెలుసునని అన్నారు.
ఇక అంతటితో ఊరుకోని నాగబాబు, రెండు రోజుల క్రితం తన సోషల్ మీడియా మాధ్యమం అయిన ఫేస్ బుక్ లో మాట్లాడుతూ, తనకు బాలకృష్ణ గారు అంటే ఎవరో తెలియదు అనడం తప్పే అని, అయితే నిజానికి తనకు బాలకృష్ణ గారు తెలుసునని, అయన మంచి కమెడియన్, టాలీవుడ్ లో తనకు మంచి పేరుందని, కాకపోతే ప్రస్తుతం అయన మన మధ్య లేకపోవడం ఒకరకంగా బాధాకరమని, ఒకప్పటి సీనియర్ కామెడియన్ అయిన వల్లూరి బాలకృష్ణ గారి ఫోటో చూపిస్తూ నందమూరి అభిమానుల ఆగ్రహాన్ని మరింత పెంచారు అనే చెప్పాలి. ఇక రెండు రోజులుగా మెగా, నందమూరి అభిమానుల మధ్య ఈ విషయమై విపరీతంగా సోషల్ మీడియా మాధ్యమాల్లో మాటల యుద్ధం నడుస్తోంది. ఇకపోతే ఈ విషయమై నేడు బాలకృష్ణ తనయ అయిన నారా బ్రాహ్మణి, నాగబాబు వ్యాఖ్యలపై ఘాటుగా బదులిచ్చారట. నిజానికి తన తండ్రి బాలకృష్ణ గారి తరువాత తమకు చిరంజీవి గారంటే ఎంతో ఇష్టమని, అలానే నాగబాబు, పవన్ కళ్యాణ్ గార్లు అన్నా కూడా మంచి అభిమానమని,
అయితే ఇటీవల బాలకృష్ణ గారు ఎన్నికల ప్రచారం నేపథ్యంలోనే చిరంజీవి, పవన్ లపై విమర్శలు చేసారుతప్ప వారిని వ్యక్తిగతంగా ఎప్పుడు విమర్శించలేదని, అంతేకాక బాలకృష్ణ గారికి గాని, మా కుటుంబంలో మరెవరికిగాని మెగా ఫ్యామిలీ అంటే వ్యతిరేకత లేదని, కానీ ఆ మాటలను ఆసరాగా తీసుకుని నాగబాబుగారు మా నాన్న ఎవరో తెలియదని చెప్పడం, అదికూడా ఒక పాత కమెడియన్ ఫోటోని చూపిస్తూ, అసలు నాన్నగారి గురించి ఏ మాత్రం పరిచయం లేనట్లు మాట్లాడడం మా అందరిని బాధించిందని అంటోందట. ఇక నాగబాబు గారు చేసిన ఈ వ్యాఖ్యలపై తాము మాత్రం ఎటువంటి కామెంట్స్ చేయమని, దానిని అయన విజ్ఞతకే వదిలేస్తామని అన్నారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here