నేపాల్లో పబ్ జీ బ్యాన్

0
26

పబ్ జి (ప్లేయర్ అనౌన్స్ బ్యాటిల్గ్రౌండ్)గేమ్ పై ప్రభుత్వం నిషేధం విధించింది. నేపాల్ లోని ఇంటర్నెట్ ప్రొవైడర్లకు, మొబైల్ ఆపరేటర్ లకు, నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్లకు పబ్ జి గేమ్ స్ట్రీమింగ్ బ్లాక్ చేయాలనీ టేలీకమ్యూనికేషన్ అథారిటీ (ఎన్టీయే)ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలే ఈ గేమ్ ను గుజరాత్ బ్యాన్ చేసిన విషయం తెలిసిందే.

యూఏఈ లో కూడా ఈ గేమ్ పై నిషేధం విధించడానికి చర్చలు జరుగుతున్నాయి. నేపాల్ ఫెడరల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ నుంచి అందిన సమాచారంతో ఈ గేమ్ పై నిషేధం విధించినట్టు ఎన్డీఏ డిప్యూటీ డైరెక్టర్ సందీప్ తెలిపారు. చిన్నారులు, యువత ఈ గేమ్ కు బానిసలుగా మారిపోతున్నారని చెప్పారు. దీంతో పిల్లలు చదవులకు ఈ గేమ్ ఆటంకంగా మారిందని తల్లిదండ్రుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వచ్చాయని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here