రకుల్ పై ఫైర్ అవుతున్న నెటిజన్స్ …. మ్యాటర్ ఏంటంటే? 

0
89
ప్రస్తుతం సినిమా హీరోలు మరియు హీరోయిన్లకు తమ అభిమానులను స్వయంగా కలుసుకునే అవకాశం లేనప్పటికీ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వారికీ ఎప్పటికపుడు చేరువ అవడం, అలానే షూటింగ్ మరియు వ్యక్తిగత విషయాలను షేర్ చేయడం వంటివి చాలా మంది నటీనటులు చేస్తుంటారు. అయితే అటువంటప్పుడు కొందరు చేసే కామెంట్స్ శృతిమించడంతో అటువంటివారికి గట్టిగా కూడా సమాధానమిస్తుంటారు తారలు. ఇక హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఓ నెటిజన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రకుల్‌ వేసుకునే బట్టలు మరియు పర్సనల్ లైఫ్ పై భగత్‌ అనే నెటిజన్‌ ఆమెను ట్యాగ్‌ చేస్తూ అసభ్యంగా కామెంట్లు పెట్టాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రకుల్‌ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. మీ అమ్మ నీకు ఇలాంటివే నేర్పిస్తున్నారా, అదే విధంగా కొన్ని మంచి విషయాలు కూడా నేర్పించమని అడుగు. నీలాంటి వాళ్లు ఉన్నంతవరకు ఆడవాళ్లకు రక్షణే ఉండదు. సమానత్వం, రక్షణ గురించి డిబేట్లు పెట్టినంతమాత్రాన సరిపోదు అని ఆమె ట్వీట్ చేస్తూ బదులిచ్చారు.
Related image
అయితే రకుల్‌ పెట్టిన ట్వీట్‌పై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భగత్‌ చేసిన కామెంట్లకు అతని తల్లిని అనడం సబబు కాదని, ఇలాంటి కామెంట్లకు సమాధానమిచ్చి మరింత మీరు ఎంతో దిగజారిపోయారంటూ ఆమెపై కామెంట్స్ చేస్తున్నారు. అయితే వాటికి సమాధానమిచ్చిన రకుల్, నా మాటతీరు, నైతిక విలువల గురించి విమర్శిస్తున్నవారందరూ ఓ మహిళను పట్టుకుని అసభ్యంగా మాట్లాడుతున్నప్పుడు ఎందుకు ప్రశ్నించరు, ఇలాంటి నీచమైన ఆలోచనలు కలిగి ఉన్నవారికి నా భాషలో బుద్ధి చెప్పాలనుకున్నాను. మాకు కూడా కుటుంబం ఉంటుందని, వారి ఇంట్లో వాళ్లను కామెంట్‌ చేస్తే నాలాగే ఫీలవుతారని చెప్పడానికే అలా స్పందించాల్సి వచ్చింది. అలానే భగత్‌ పెట్టిన కామెంట్‌కు అతని తల్లి చెంప చెళ్లుమనిపిస్తుందని ఆశిస్తున్నాను అని సమాధానమిచ్చారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here