ప్రాణం పోయే పరిస్థితి లోను ప్రాణం కాపాడిన నేవి అధికారి……

0
28

ఈ ఘటన కొచ్చిలోని వైపీన్ బీచ్ లో చోటుచేసుకుంది. ఔరంగాబాద్ కు చెందిన దిలీప్ కుమార్ బీచు వెళ్ళాడు. అక్కడ సముద్రంలో కలిసి కాలువలో దిగి స్నానం చేస్తూ మునిగి పోయాడు. అయితే , అక్కడ ఉన్న ప్రజలు భయంతో అతన్ని రక్షించే ప్రయత్నం చేయలేదు. ఆ సమయంలో అక్కడ తన భార్యతో సెలవులు గడిపేందుకు వచ్చిన నేవి అధికారి లెఫ్టినెంట్ రాహుల్ దలాల్… నీటిలో మునిగిపోతున్న దిలీప్ ను చూసి చలించిపోయారు వెంటనే నీటిలోకి దూకి దిలీప్ ను ఒడ్డుకు తీసుకొచ్చాడు. అప్పటికే దిలీప్ నీళ్లు తాగేసి అపస్మారక స్థితికి చేరుకున్నాడు.

Help needed. Drowning man’s hand in sea or ocean.

దీంతో అతడితో నీళ్లు కక్కించి సిపిఆర్ ( cardiopulmonary resusciatation )తో గుండెను ఒత్తారు. దీంతో ఊపిరి పీల్చుకుని చావు నుంచి  తప్పించాడు. రాహుల్  చేసి ఉండకపోతే అతను చనిపోయేవాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని దిలీప్ను ఆశుపత్రికి తరలించారు. ఈ విషయాన్నీ భారత నౌక దళం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఆసుపత్రిలో చికిత్స తర్వాత దిలీప్ పూర్తిగా కోలుకున్నాడని పేర్కొంది. సమయానికి స్పందించి బాధితుడి కాపాడిన రాహుల్ సాహసానికి గర్విస్తున్నాని తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here