నోకియా సంస్థ ప్రపంచ రికార్డు…. ఏడు కెమెరాల మొబైల్ ని విడుదల చేసిన సంస్థ!

0
100
ప్రస్తుతం నడుస్తున్న ఈ డిజిటల్ ప్రపంచంలో ప్రతి రోజు రకరకాల గ్యాడ్జెట్లు మార్కెట్ లోకి వచ్చి సందడి చేస్తున్నాయి. ఇక మరీ ముఖ్యంగా ప్రజలు ఎక్కువగా స్మార్ట్ ఫోన్స్ తరచూ మారుస్తూ ఉండడంతో, రోజుకోరకం మొబైల్ మార్కెట్ లోకి వస్తోంది. ఇకపోతే ఒకపుడు ఇండియా మొబైల్ మార్కెట్ లో అగ్రభాగాన నిలిచిన హెచ్‌ఎండీ గ్లోబల్‌ బ్రాండ్‌ నోకియా, ప్రస్తుతం మళ్ళి తమ పునర్వైభవాన్ని తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు మార్కెట్ లోకి తమ బ్రాండ్ వారి రకరకాల మొబైల్ ఎప్పటికపుడు తీసుకువస్తూ వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నిస్తోంది. ఇకపోతే ఇప్పటికే తమ బ్రాండ్ ఆండ్రాయిడ్ మొబైల్స్ తో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన నోకియా, తాజాగా మరో ఘనతను చాటుకుంటోంది. ఏకంగా ఏడు కెమెరాలతో ఒక స్మార్ట్‌ఫోన్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తేనుంది. తాజగా లీకైన వీడియో అందించిన వివరాల ప్రకారం ఈ మొబైల్ లో వెనుక 5 కెమెరాలు, ముందు రెండు కెమెరాలు మొత్తం7 కెమెరాలతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించింది.
Image result for nokia 9
అంతే కాదు ఇది ప్రపంచంలోనే ఇన్ని కెమెరాలు సంక్షిప్తం చేసుకున్న మొబైల్ డివైస్‌గా ఖ్యాతిని దక్కించుకోనుంది. నోకియా 9 ప్యూర్‌ వ్యూ  పేరుతో, ప్యూర్‌ డిస్‌ ప్లే ప్యానెల్‌తో తీసుకొస్తున్నఈ డివైస్‌ స్పెసిఫికేషన్లు విషయానికి వస్తే, నోకియా 9 ప్యూర్‌ వ్యూ 5.9 అంగుళాల డిస్‌ప్లే  ఆండ్రాయిడ్‌ 9.0 పై క్వాల్కం స్నాప్‌డ్రాగన్‌ 845 సాక్‌ 6జీబీ ర్యామ్‌/128 జీబీ స్టోరేజ్‌ 8జీబీ ర్యామ్‌/256జీబీ స్టోరేజ్‌ ఫింగర్‌ ప్రింట్‌ డిస్‌ప్లే, మరియు ప్యూర్ మెటల్ బాడీతో ఫోన్ రూపొందినట్లు సంస్థ ప్రతినిధులు తెలుపుతున్నారు. కాగా కొద్దిరోజుల్లో అంతర్జాతీయ మార్కెట్ లో దీని ధర మరియు మొబైల్ ను కూడా కస్టమర్స్ కు ఒక ప్రకటన ద్వారా తెలుపుతామని సంస్థ ప్రతినిధులు చెపుతున్నారు. కాగా ప్రస్తుతం ఈ ఫోన్ టెక్ మీడియా వర్గాల్లో వైరల్ గా మారింది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here