ఎన్టీఆర్ మూవీ ప్రీ రిలీజ్ టాక్ తెలిస్తే షాక్ అవుతారు!

0
94
విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న సినిమా ఎన్టీఆర్…ఆయన తనయుడు బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాపై టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా అంచనాలున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో రానా, సుమంత్, విద్య బాలన్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు లతో పాటు దాదాపుగా కొందరు హీరోయిన్లు కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి అందించిన సంగీతం కూడా ప్రధాన ఆకర్షణ కానుందని యూనిట్ సభ్యులు చెపుతున్నారు. ఇకపోతే రేపు విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ టాక్ ప్రస్తుతం సంచలనంగా మారింది.
Image result for ntr biopic
ఇక సినిమా ఎన్టీఆర్ గారి జననం నుండి మొదలవుతుందని, అక్కడినుండి అయన నిమ్మకూరులో ఉంటూ రిజిస్ట్రార్ గా పనిచేసిన దగ్గరినుండి సినిమాల్లోకి ప్రవేశం, ఆ తరువాత పూర్తి స్థాయి హీరోగా మారక మెల్లగా అవకాశాలు పెరగడం, పలు పెద్ద సంస్థలు ఆయనతో సినిమాలు చేయడానికి ముందుకు రావడం, ఆపై విశ్వ విఖ్యాత నట సార్వభౌముడిగా ఎదగడం వంటి ఘట్టాలు సినిమాలో అత్యద్భుతంగా ఉంటాయట. ఇకపోతే సినిమాలోని ఇంటర్వెల్ ఎపిసోడ్, సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు, ఇక ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్ లు సినిమాకు ప్రాణంగా నిలుస్తాయని టాక్. మరి రేపు విడుదల అయ్యే ఈ సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుంటుందో చూడాలి…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here