ఎన్టీఆర్ ‘మహానాయకుడు’ రిలీజ్ డేట్ ఫిక్స్!

0
69
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ గారి జీవిత గాథ ఆధారంగా ఇటీవల వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా ఫ్లాప్ గా నిలవడంతో, తదుపరి రాబోయే రెండవ భాగం మహానాయకుడు సినిమాని ఎంతో జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు క్రిష్. ఇక ఇప్పటికే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ప్రేక్షకులను మెప్పించేలా తీసినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ సినిమాలో కూడా మరికొంతమంది దిగ్గజ టాలీవుడ్ నటులు దర్శనమివ్వనున్నారట.
Image result for ఎన్టీఆర్ మహానాయకుడు
ఇక రెండవ భాగమైన ఈ మహానాయకుడు సినిమాని ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు కాసేపటి క్రితం ఒక ప్రకటన వెలువడింది. నిజానికి ఇంకా ముందే ఈ సినిమాను విడుదల చేద్దాం అనుకున్నప్పటికీ, సినిమాలో కొన్ని మార్పులు చేర్పుల కారణంగా విడుదలను కొంత వాయిదా వేసి ఎట్టకేలకు ఈ డేట్ ని ఫిక్స్ చేసినట్లు చెపుతున్నారు. అయితే మొదటి భాగం వలె కాకుండా ఈ సినిమా తప్పకుండ ప్రేక్షకుడిని అలరించి, ఆ మహానాయకుడి రాజకీయ జీవితాన్ని తెలుసుకునేందుకు తప్పకుండ థియేటర్ కు రప్పిస్తుందని ధీమా వ్యక్తం చేస్తోంది చిత్ర యూనిట్. మరి రేపు విడుదల తరువాత మహానాయకుడు ఎంతటి కలెక్షన్లు రాబట్టి విజేతగా నిలుస్తాడా తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజులు ఓపికపట్టవలసిందే…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here