హరికృష్ణ విగ్రహం ఏర్పాటు చేయడంపై కన్నీరుపెట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్…. మ్యాటర్ తెలిస్తే షాక్ అవుతారు

0
109
ఇటీవల రోడ్డు ప్రమాదంలో హఠాన్మరణం చెందిన ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణ గారి మరణాన్ని ఇప్పటికీ తెలుగువారు మర్చిపోలేకపోతున్నారు అనే చెప్పాలి. ఇక అయన మరణంతో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సహా అయన కుటుంబసభ్యులు మొత్తం ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారని చెప్పాలి. ఇకపోతే హరికృష్ణ మరణం తరువాత ఆయన పెద్ద కుమార్తె సుహాసినికి టిడిపి తరపున కూకట్పల్లి నియోజకవర్గంలో ఎమ్యెల్యే సీటు కేటాయించారు చంద్రబాబునాయుడు. అయితే ఆమెకు గెలిపించడం కోసం జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, బాలకృష్ణ అతి త్వరలో అక్కడ పర్యటన చేయనున్నట్లు సమాచారం. ఇక అటు ఏపీలోనూ ఎన్నికల వేడి మొదలైంది. అన్ని ప్రధాన పార్టీలు కూడా వివిరిగా ప్రజల్లోకి వెళుతూ, తమకు ఓటేయాలని ఎవరికి వారు కోరుతున్నారు. ఇకపోతే నిన్న విశాఖపట్నంలో దివంగత హరికృష్ణ గారి విగ్రహ ఏర్పాటు అక్కడి కొంత ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. నిజానికి అక్కడ ఇదివరకు ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రాజీవ్ గాంధీ తదితరుల విగ్రహాలు వున్నాయి. అయితే ఇటీవల అక్కడి నాయకులు అక్కినేని నాగేశ్వర రావు, మరియు దాసరి నారాయణ రావుల విగ్రహాలను ఏర్పాటుచేయాలని అక్కడి అధికారులకు అర్జీ పెట్టుకున్నారు.
అయితే వారి విగ్రహాలతో పాటు నిన్న హరికృష్ణ విగ్రహం కూడా ఏర్పాటు చేయడంతో, ఎవ్వరిని అడిగి హరికృష్ణగారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసారు అంటూ మునిసిపల్ అధికారులు మండిపడుతున్నారు. అయితే దీనిపై మాజీ రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ రాములు మాట్లాడుతూ, ఎన్టీఆర్ గారి అబ్బాయి హోదాలో హరికృష్ణ గారు అటు సినిమాల్లో ఇటు రాజకీయాల్లో తన సేవలను అందించి ఎంతో కృషి చేసారని, అటువంటి వ్యక్తి విగ్రహం ఏర్పాటు చేయడానికి ఎవ్వరి అనుమతి అవసరం లేదని రాములు అంటున్నారు. అయితే దీనిపై నేడు స్పందించిన ఎన్టీఆర్, హఠాత్తుగా మమ్మల్ని అందరిని వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయిన మా తండ్రిగారి విగ్రహాన్ని విశాఖలో ఏర్పాటు చేసి, రాములు గారు మా అందరికి ఎంతో ఆనందాన్ని ఇచ్చారని తన సన్నిహితులవద్ద చెప్పారట. అంతేకాక తాము కూడా కొద్దిరోజలుగా తన తండ్రికి గుర్తుగా ఎక్కడైనా విగ్రహం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నామని, కాగా ఇంతలో విశాఖలో రాములు గారు హరికృష్ణ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయించి మా అందరి హృదయాలు గెలుచుకున్నారని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here